పాకిస్తాన్ సూపర్ లీగ్ -2026లో లాహోర్ ఖలందర్స్ ఓటుమల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లహోర్ ఓటమి పాలైంది. షాహీన్ షా అఫ్రిది సారథ్యంలోని లహోర్ ఖలందర్స్‌కు ఇది నాలుగో ఓటమి కావడం గమనార్హం. నిన్న జరిగిన మ్యాచ్‌లో లహోర్ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లహోర్ 19.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది.
లహోర్ ఇన్నింగ్స్‌లో హసీబుల్లా ఖాన్( 33) మినహా మిగితా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. క్వెట్టా గ్లాడియేటర్స్ బౌలర్లు ఉస్మాన్ తారీఖ్, జునైద్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టి లహోర్ పతనాన్ని శాసించారు. అనంతరం 135 పరుగుల లక్ష్యాన్ని క్వెట్టా గ్లాడియేటర్స్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలో ఊదిపడేసింది. క్వెట్టా ఫస్ట్ డౌన్ బ్యాటర్ రిలీ రుసో(60) అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది తన సహనాన్ని కోల్పోయాడు.
ఏమి జరిగిందంటే?
మొదట బ్యాటింగ్‌కు దిగిన లహోర్ ఖలందర్స్.. క్వెట్టా గ్లాడియేటర్స్ బౌలర్ల ధాటికి 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు కెప్టెన్ షాహీన్ అఫ్రిది తనను తానుగా ప్రమోట్ చేసుకుని ముందుగా బ్యాటింగ్‌కు వచ్చాడు.
సికిందర్ రజా, డానియల్ సామ్స్‌ను కాదని అఫ్రిది ముందుగా బ్యాటింగ్ రావడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే షాహీన్ తన ఆడిన మొదటి బంతికే స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో గోల్డెన్ డకౌట్ అయిన బాధలో షాహీన్ సహనాన్ని కోల్పోయాడు.
డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే క్రమంలో బౌండరీ లైన్ దగ్గర ఉన్న టైర్లపై,సైడ్ స్క్రీన్‌పై తన బ్యాట్‌ను బలంగా బాదాడు. అంతేకాకుండా మెట్లకు కూడా తన బ్యాట్‌ను బలంగా కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
చదవండి: T20 WC 2026: మ్యాచ్ ఫిక్సింగ్!.. మరో సంచలన వార్త
Shaheen Shah Afridi broke his bat after getting out for duck 🦆. #LHQVQTG pic.twitter.com/DYzLMCFe9f
— Nibraz Ramzan (@nibraz88cricket) April 17, 2026


