‘ఈసారి హిట్‌ వికెటవ్వను.. విరుగుడు మంత్రమదే!’ | Sai Sudharsan Reveals Special Plan-IPL Final vs RCB Avoid Hit-Wicket | Sakshi
Sakshi News home page

Sai Sudharsan: ‘ఈసారి హిట్‌ వికెటవ్వను.. విరుగుడు మంత్రమదే!’

May 30 2026 4:16 PM | Updated on May 30 2026 4:41 PM

Sai Sudharsan Reveals Special Plan-IPL Final vs RCB Avoid Hit-Wicket

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో శుక్ర‌వారం క్వాలిఫ‌య‌ర్‌-2లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌ను ఓడించి గుజ‌రాత్ టైటాన్స్ ఫైన‌ల్లో అడుగుపెట్టింది. కెప్టెన్‌ శుబ్‌మ‌న్ గిల్ సెంచ‌రీతో చెల‌రేగ‌గా, మ‌రో ఓపెన‌ర్ సాయి సుద‌ర్శ‌న్ అర్థ‌సెంచ‌రీతో రాణించాడు. సాయి సుద‌ర్శ‌న్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. 

అయితే ఆర్సీబీతో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-1 పోరులో హిట్ వికెట్‌గా వెనుదిరిగిన సాయి సుద‌ర్శ‌న్ రాజ‌స్తాన్‌తో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-2 పోరులోనూ మ‌రోసారి హిట్‌వికెట్‌గా వెనుదిర‌గ‌డం గ‌మ‌నార్హం. 150 ఏళ్ల క్రికెట్ చ‌రిత్ర‌లో వ‌రుస‌గా రెండుసార్లు హిట్‌వికెట్‌గా వెనుదిరిగిన ఆట‌గాడిగా సాయి సుద‌ర్శ‌న్ నిలిచిపోయాడు. హిట్‌వికెట్‌గా రెండోసారి ఔట‌వ్వ‌డంపై సాయి సుద‌ర్శన్ ఎట్ట‌కేల‌కు మౌనం వీడాడు. 

ఈసారి బ్యాట్ జారిపోకుండా ఏదైనా కొత్త ప‌ద్ధ‌తిని అనుస‌రిస్తాన‌ని న‌వ్వుతూ పేర్కొన్నాడు. ‘ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌డానికి కొత్త‌గా ఏదైనా చేయాలి. అందుకు కొన్ని గ్రిప్ టెక్నిక్స్ ఉప‌యోగించి బంతులు ఆడే ప్ర‌య‌త్నం చేస్తాను. ఆర్సీబీతో మ్యాచ్‌లో బంతిని ఆడే క్ర‌మంలో నా బ్యాట్ చేతిలో నుంచి జారి బౌన్స్ అయి వికెట్ల మీద ప‌డింది. 

కానీ రాజ‌స్తాన్‌తో మ్యాచ్‌లో స్ట్రెయిట్ షాట్ ఆడాల‌నుకున్నా. కానీ ఈసారి కూడా బంతి బౌండ‌రీ వెళ్లిన‌ప్ప‌టికీ బ్యాట్ నేరుగా వెళ్లి వికెట్ల‌ను గిరాటేసింది. ఫైన‌ల్లో ఈ స‌మ‌స్య రాకుండా ఒక కొత్త ప‌ద్ధ‌తిని అనుస‌రించాల‌నుకుంటున్నా. అది ఎంత‌మేర స‌ఫ‌ల‌మ‌వుతుందో చూ డాలి’ అని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సీజ‌న్‌లో సాయి సుద‌ర్శ‌న్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. గుజ‌రాత్ త‌ర‌ఫున ఓపెనింగ్‌లో వ‌స్తున్న సాయి సుద‌ర్శ‌న్ 16 ఇన్నింగ్స్‌లో 710 ప‌రుగుల‌తో ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇందులో ఒక సెంచ‌రీ, 8 అర్థ‌సెంచ‌రీలున్నాయి. అయితే ఈ సీజ‌న్‌లో గుజ‌రాత్ ఆడిన తొలి ఆరు మ్యాచ్‌ల్లో సాయి సుద‌ర్శ‌న్ ఒక ఫిఫ్టీ కూడా న‌మోదు చేయ‌లేదు. 

ఆ త‌ర్వాత నుంచి వ‌రుస‌గా ప్ర‌తి మ్యాచ్‌లోనూ స్థిర‌మైన ప్ర‌ద‌ర్శ‌నతో క‌నీసం అర్థ‌సెంచ‌రీ సాధించ‌డం విశేషం. మ‌రో విష‌య‌మేంటంటే సాయి సుద‌ర్శ‌న్ వ‌రుస‌గా రెండో సీజ‌న్‌లోనూ 700 ప‌రుగుల మార్క్‌ను అధిగ‌మించాడు. గ‌తంలో క్రిస్ గేల్ మాత్ర‌మే వ‌రుస‌గా రెండు సీజ‌న్ల‌లో 700 ప్ల‌స్ మార్కును దాటాడు. తాజాగా ఈ ఘ‌న‌త సాధించిన రెండో ప్లేయ‌ర్‌గా సాయి సుద‌ర్శ‌న్ నిలిచాడు.

 

చదవండి: అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌.. కానీ 332 కోట్ల మెలిక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement