గౌతమ్‌ గంభీర్‌ సంచలన నిర్ణయం! రోహిత్‌ శర్మకు భారీ షాక్‌? | Rohit Sharma Not In Gambhirs 2027 ODI World Cup Squad, Yashasvi Jaiswal Emerges As Backup Option, Says Reports | Sakshi
Sakshi News home page

గౌతమ్‌ గంభీర్‌ సంచలన నిర్ణయం! రోహిత్‌ శర్మకు భారీ షాక్‌?

May 31 2026 5:36 PM | Updated on May 31 2026 6:30 PM

Rohit Sharma Not In Gambhirs 2027 World Cup Squad: Reports

వన్డే వరల్డ్‌కప్‌-2027లో టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఆడుతాడా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 39 ఏళ్ల రోహిత్‌ శర్మ ప్రస్తుతం ఫిట్‌నెస్‌ సమస్యలతో సతమవుతున్నాడు. తొడ కండరాల గాయం కారణంగా ఐపీఎల్‌-2026లో రోహిత్‌ కేవలం 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

ఆ తర్వాత పునరాగమనం చేసినప్పటికి పూర్తి ఫిట్‌నెస్‌తో మాత్రం హిట్‌మ్యాన్‌ కనిపించలేదు. కేవలం ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా మాత్రమే బరిలోకి దిగాడు. అయితే ఈ జూన్‌లో అఫ్గానిస్తాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు రోహిత్‌ను ఎంపిక చేసినప్పటికి, అతడు ఆడేది అనుమానమే. సిరీస్‌ ప్రారంభ సమయానికి  పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తేనే రోహిత్‌ శర్మను జట్టులో కొనసాగించే అవకాశముంది.

కాగా వన్డే ప్రపంచకప్‌-2027 టోర్నీ భవిష్యత్తు ప్రణాళికలలో భాగంగా టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ స్థానంలో మరొక ముంబై ఆటగాడు, యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను ఓపెనర్‌గా గంభీర్‌ భావిస్తున్నట్లు 'క్రిక్‌బ్లాగర్' వెబ్‌సైట్ పేర్కొంది.

వాస్తవానికి అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కే రోహిత్‌ స్థానంలో జైశ్వాల్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ భావించందంట. కానీ రోహిత్‌ శర్మ బోర్డు అధికారులతో ఫోన్‌ చేసి మాట్లడడంతో సెలక్టర్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారని 'క్రిక్‌బ్లాగర్' వెల్లడించింది.

జైస్వాల్ ఎంపికపై సస్పెన్స్
కాగా జైశ్వాల్‌ గతేడాది డిసెంబర్‌లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. రెగ్యూలర్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ గాయం కారణంగా దూరం కావడంతో జైశ్వాల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను జైశూ ప్రారంభించాడు.

తొలి రెండు మ్యాచ్‌లలో నిరాశపరిచిన యశస్వి.. వైజాగ్‌ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో మాత్రం శతక్కొట్టాడు. దీంతో జైశ్వాల్‌ను అఫ్గాన్‌తో వన్డేలకు కూడా ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ సెలక్టర్లు ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో అతడు పేరు లేదు. 

ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు మాత్రమే కాకుండా, శ్రీలంకలో జరగబోయే ముక్కోణపు సిరీస్ కోసం ప్రకటించిన 'ఇండియా-ఎ' జట్టులోనూ జైస్వాల్‌కు చోటు దక్కలేదు. రోహిత్‌ ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకుని జైశ్వాల్‌ను  'ఇండియా-ఎ' జట్టుకు ఎంపిక చేయకపోయినట్లు తెలుస్తోంది. ఒకవేళ అఫ్గాన్‌తో వన్డేలకు రోహిత్‌ దూరమైతే ఆ స్ధానాన్ని జైశ్వాల్‌ భర్తీ చేయనున్నాడు.

ఆఫ్గాన్‌ వన్డే  సిరీస్‌కు భారత జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రోహిత్ శర్మ (ఫిట్‌నెస్‌కు లోబడి), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ (వైస్‌ కెప్టెన్‌), కెఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌), హార్దిక్ పాండ్యా (ఫిట్‌నెస్‌కు లోబడి), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement