
రంజీ ట్రోఫీ 2025-26లో భాగంగా కాన్పూర్ వేదికగా ఆంధ్రతో జరుగుతున్న మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ ఆటగాడు రింకూ సింగ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 185 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో రింకూ తన ఎనిమిదవ ఫస్ట్ క్లాస్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
అతడు తన బ్యాటింగ్‌ను 124 పరుగులతో కొనసాగిస్తున్నాడు. విప్రజ్ నిగమ్, ఆర్యన్‌లతో కలిసి రింకూ కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఉత్తరప్రదేశ్ 143 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. యూపీ ఇంకా 100 పరుగులు వెనకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో రింకూతో పాటు శివమ్ శర్మ(9) ఉన్నారు. అంతకుముందు మాధవ్ కౌశిక్(54), ఆర్యన్(66) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఆంధ్ర బౌలర్లలో ఇప్పటివరకు రిక్కీ భుయ్, పృథ్వీ రాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. శశికాంత్, సౌరభ్ కుమార్‌లతో తలా వికెట్ పడగొట్టారు. ఇక ఆంధ్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 470 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర బ్యాటర్లలో కేఎస్ భరత్(142), షేక్ రషీద్(136) సెంచరీలతో సత్తాచాటారు. రింకూ సింగ్ ఈ మ్యాచ్ తర్వాత టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు.
చదవండి: IND vs AUS: 25 ఫోర్లు,8 సిక్స్‌లు.. పెర్త్‌లో బౌలర్లను ఉతికారేసిన రోహిత్ శర్మ!