కోహ్లికి గాయం.. లక్నోతో ఆడేది అనుమానమే! | RCB Star Virat Kohli Wears Bandage On Leg Ahead Of LSG Clash | Sakshi
Sakshi News home page

కోహ్లికి గాయం.. లక్నోతో ఆడేది అనుమానమే!

Apr 14 2026 10:44 PM | Updated on Apr 14 2026 10:53 PM

RCB Star Virat Kohli Wears Bandage On Leg Ahead Of LSG Clash

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ విరాట్ కోహ్లి గాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు మ్యాచ్‌లాడిన ఆర్సీబీ మూడు విజ‌యాల‌తో ప‌ట్టిక‌లోమూడో స్థానంలో కొన‌సాగుతుంది.  ఈ నేప‌థ్యంలో బుధవారం ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌తో ఆర్సీబీ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆడేది అనుమానంగానే క‌నిపిస్తోంది. 

అయితే సోమ‌వారం ట్రైనింగ్ సెష‌న్‌లో కోహ్లీ కాలికి బ్యాండేజ్‌తో క‌నిపించాడు. ప్రాక్టీస్ అనంర‌తం కోహ్లీ మాజీ క్రికెట‌ర్ కేన్ విలియ‌మ్స‌న్‌, కెప్టెన్ రిష‌బ్ పంత్‌ల‌ను న‌వ్వుతూ ప‌ల‌కరించాడు.  దీనికి సంబంధించిన వీడియోను ల‌క్నో ఫ్రాంచైజీ త‌మ ఎక్స్‌లో షేర్ చేసుకుంది. అయితే వీడియోలో కోహ్లీ కుంటుతూ న‌డుస్తున్న‌ట్లుగా క‌నిపించింది. 

దీంతో చీల‌మండ గాయం నుంచి కోహ్లి ఇంకా కోలుకోలేద‌ని క్లియ‌ర్‌గా తెలుస్తోంది. అందుకే ల‌క్నోతో మ్యాచ్‌లో కోహ్లి ఆడుతాడా లేదా అన్న‌ది అనుమానంగా మారింది. ఒక‌వేళ ఆడినా ఇంపాక్ట్  ప్లేయ‌ర్‌గా వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఇక ఈ సీజ‌న్‌లో కోహ్లి నాలుగు మ్యాచ్‌లు క‌లిపి 179 ప‌రుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థ‌సెంచ‌రీలున్నాయి. ఇక ఆదివారం ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లోనూ కోహ్లీ కేవ‌లం బ్యాటింగ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు.

చదవండి: ‘రుతురాజ్‌ నీకో దండం.. ఇకనైనా ఆయుశ్‌కు చాన్స్‌ ఇవ్వు’

Advertisement
 
Advertisement
Advertisement