జడేజాది క్లియర్‌గా నాటౌట్‌.. కావాలనే ఔట్‌ ఇచ్చారు! ఫ్యాన్స్‌ ఫైర్‌ | Ravindra Jadejas Dismissal Ignites Controversy As Furious Fans Accuse Harry Brook Of Grounding Catch, Check Post Inside | Sakshi
Sakshi News home page

IND vs ENG: జడేజాది క్లియర్‌గా నాటౌట్‌.. కావాలనే ఔట్‌ ఇచ్చారు! ఫ్యాన్స్‌ ఫైర్‌

Jul 25 2025 1:37 PM | Updated on Jul 25 2025 1:54 PM

Ravindra Jadejas dismissal ignites controversy as furious fans accuse Harry Brook of grounding catch

మాంచెస్టర్‌ వేదికగా జరుగుతున్న నాలుగు టెస్టులో టీమిండియాపై ఇంగ్లండ్‌ ఆదిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య ఇంగ్లండ్‌ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 225 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ ఇంకా భారత్‌ కంటే 133 పరుగులు వెనకంజలో ఉంది.

అంతకుముందు భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 264/4తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌.. ఆదనంగా 94 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత బ్యాటర్లలో సాయిసుదర్శన్‌(61) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రిషబ్‌ పంత్‌(54) విరోచిత పోరాటం కనబరిచాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బెన్‌ స్టోక్స్‌ 5 వికెట్లతో చెలరేగాడు.

ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఔటైన తీరు వివాదస్పదమైంది. జడేజా ఇచ్చిన క్యాచ్‌ను ఇంగ్లండ్‌ ఫీల్డర్‌ హ్యారీ బ్రూక్‌ క్లీన్‌గా అందుకోలేదన్న చర్చ క్రికెట్‌ వర్గాల్లో నడుస్తోంది. భారత ఇన్నింగ్స్‌ 85వ ఓవర్‌ వేసిన ఆర్చర్‌.. ఐదో బంతిని జడేజాకు ఎవే స్వింగర్‌గా సంధించాడు.

ఆ బంతిని జడేజా డిఫెన్స్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్‌ తీసుకుని సెకెండ్‌ స్లిప్‌ దిశగా వెళ్లింది. సెకెండ్‌ స్లిప్‌లో ఉన్న బ్రూక్‌ డైవ్‌ చేస్తూ క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే బ్రూక్‌ క్యాచ్‌ను అందుకునేటప్పుడు బంతి నేలకు తాకినట్లు కన్పించింది. 

కానీ ఫీల్డ్‌ అంపైర్‌ మాత్రం అది క్లీన్‌ క్యాచ్‌ కాదా కనీసం చెక్‌ చేయకుండా ఔట్‌ అని వేలు పైకెత్తాడు. దీంతో జడేజా(20 పరుగులు) కూడా ఔట్‌ అని భావించి రివ్యూ తీసుకోకుండా మైదానం వీడాడు. ఈ నేపథ్యంలో ఫీల్డ్‌ అంపైర్‌లు పై భారత అభిమానులు మండిపడుతున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా ఎలా ఔట్‌ ఇస్తారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బంతి క్లియర్‌గా నేలకు తాకిందంటూ స్క్రీన్‌ షాట్లను ఎక్స్‌లో షేర్‌ చేస్తున్నారు.



చదవండి: ఏడ్చేసిన కరుణ్‌ నాయర్‌.. ఓదార్చిన కేఎల్‌ రాహుల్‌.. ఇక గుడ్‌బై!?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement