
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 22 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 193 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా చతకలపడింది. రవీంద్ర జడేజా (61 నాటౌట్; 181 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసినా.. మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రైడన్ కార్స్ రెండు వికెట్లు సాధించాడు. ఇక గిల్ సేన ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. లక్ష్య చేధనలో బ్యాటర్లు భాగస్వామ్యాలను నెలకొల్పకపోవడం వల్ల భారత్ ఓటమి పాలైందని ఆయన తెలిపారు.
"భారత రెండో ఇన్నింగ్స్‌లో కనీసం ఒక్కటైన 60 నుంచి 70 పరుగుల భాగస్వామ్యం నమోదైంటే ఫలితం మరో విధంగా ఉండేది. కానీ భారత బ్యాటర్లు అలా చేయడంలో విఫలమయ్యారు. స్పిన్నర్లు జో రూట్, షోయబ్ బషీర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు జడేజా దూకుడుగా ఆడలేదని కొంతమంది విమర్శిస్తున్నారు.
కానీ ఆ సమయంలో అతడు ఆడిన తీరు సరైనదే. ఎందుకుంటే బయట మరో వికెట్ లేదు. జడేజా పోరాటానికి పూర్తి మార్క్‌లు ఇవ్వాల్సిందేనని" అధికారిక బ్రాడ్‌కాస్టర్ సోనీ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ పేర్కొన్నారు. కాగా భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సైతం తమ ఓటమికి కారణం ఇదే చెప్పుకొచ్చాడు.
ఒక 50 పరుగుల భాగస్వామ్యం వచ్చి వున్నా తాము గెలిచే వాళ్లమని గిల్ అన్నాడు. ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. ఎనిమిదేళ్ల తర్వాత ఇంగ్లండ్ టెస్టు జట్టులోకి లైమ్ డాసన్ వచ్చాడు. భారత్ కూడా తమ తుది జట్టులో మార్పులు చేసే ఛాన్స్ ఉంది.
చదవండి: IND vs ENG: భారత్‌తో నాలుగో టెస్టు.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! 8 ఏళ్ల తర్వాత స్టార్ ప్లేయర్ రీఎంట్రీ