Ravi Shastri Vs Javed Miandad: రవిశాస్త్రి, మియాందాద్‌ల గొడవకు కారణమైన 'ఆడి' కారు.?!

Ravi Shastri Reveals Javed Miandad Insulted Him By Mentioning Audi Car - Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌ రవిశాస్త్రి అందరికి సుపరిచితమే. మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రవిశాస్త్రి.. ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత కామెంటేటర్‌గా, టీమిండియా హెడ్‌కోచ్‌గానూ సేవలందించాడు. ఒకే ఓవ‌ర్లో ఆరు సిక్సులు కొట్టిన బ్యాట్స్ మెన్ లిస్టులోనూ తనది ప్రత్యేక స్థానం. ఇక గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న రవిశాస్త్రి టీమిండియా తరపున 80 టెస్టులు, 150 వన్డేలు ఆడాడు. 1983 వరల్డ్‌కప్‌ గెలిచిన టీమిండియా జట్టులో రవిశాస్త్రి సభ్యుడిగా ఉన్నాడు.


విషయంలోకి వెళితే.. 1985లో ఆస్ట్రేలియా వేదికగా బెన్సన్‌ అండ్‌ హెడ్జెజ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌ జరిగింది. ఈ టోర్నీ ఫైనల్లో భారత్‌, పాకిస్తాన్‌లు తలపడ్డాయి. చిరకాల ప్రత్యర్థి పాక్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా కప్‌ను ఎగరేసుకుపోయింది. ఫైనల్‌ మ్యాచ్‌తో టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన రవిశాస్త్రి 182 పరుగులతో పాటు 8 వికెట్లు తీశాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచిన రవిశాస్త్రి ఆడి కారును సొంతం చేసుకున్నాడు. విజయం అనంతరం ఆడి కారును రవిశాస్త్రి ఎంతో ఇష్టంగా డ్రైవ్‌ చేయగా.. తోటి టీమిండియా ఆటగాళ్లు కారు మీద కూర్చోని సెలబ్రేషన్స్‌ చేసుకోవడం అప్పట్లో ట్రెండింగ్‌గా మారింది. ఈ నేపథ్యంలో అదే ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ జావెద్‌ మియాందాద్‌ తనను అవమానించిన ఒక సంఘటనను.. ఆడి కారు గెలుచుకోవడం వెనుక ఉన్న కథను తాజాగా రివీల్‌ చేశాడు. 


''1985 బెన్సన్‌ అండ్ హెడ్జెస్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో పాకిస్థాన్ ను ఓడించడానికి మాకు మరో 15-20 రన్స్‌ అవసరం ఉంది. ఆ సమయంలో జావెద్‌ మియాందాద్‌ సెట్‌ చేసిన ఫీల్డ్ ను తెలుసుకోవడానికి స్క్వేర్‌ లెగ్‌ వైపు చూస్తున్నాను. అప్పుడు మిడ్‌ వికెట్ లో ఉన్న మియాందాద్‌ నా దగ్గరికి వచ్చి.. నువ్వు మళ్లీ మళ్లీ అక్కడేం చూస్తున్నావ్‌ అని తనదైన స్టైల్లో అన్నాడు. కారును ఎందుకు చూస్తున్నావ్‌.. అది నీకు దక్కదు అంటూ వెటకారంగా మాట్లాడాడు. దీనికి కౌంటర్‌గా అవును జావెద్‌.. నేను అటు వైపు చూడడం లేదు.. ఆ కారే నా వైపు చూస్తుంది.. నా ఇంటికి వస్తుంది అని పేర్కొన్నా'' అంటూ తెలిపాడు.


ఇక 1983 వరల్డ్‌ కప్‌ గెలిచిన రెండేళ్లకే వరల్డ్‌ సిరీస్‌ గెలవడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నాడు. తన జీవితంలో తాను చేసిన ఎన్నో పనుల కంటే  ఆడి కారు టాప్‌ స్థానంలో ఉంటుందని పేర్కొన్నాడు. ఆరు సిక్స్‌లు కూడా ఎప్పటికీ గుర్తొచ్చేదే అయినా.. తన  కెరీర్‌లో  మాత్రం 1985లో సాధించిన ఆడి కారుకే ఎక్కువ విలువుంటుందని తెలిపాడు. అప్పుడప్పుడే వన్డే క్రికెట్ లోకి రంగులు రావడం, డే నైట్‌ మ్యాచ్ లు, రంగుల దుస్తులు తొలిసారి ఇండియాకు రావడం లాంటివి ప్రత్యేకమైనవి. ఇక ఫైనల్లో పాకిస్థాన్ ను ఓడించడం అంటే అది పెద్ద అచీవ్‌మెంట్‌ కింద లెక్క అని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. 

ఇక రిటైర్మెంట్‌ అనంతరం కామెంటేటర్‌గా రాణిస్తున్నాడు. టీమిండియా హెడ్‌ కోచ్‌గా పనిచేసిన రవిశాస్త్రి కొన్ని అద్భుత విజయాల్లో భాగంగా నిలిచాడు. రవిశాస్త్రి హెడ్‌కోచ్‌గా టీమిండియా 43 టెస్టుల్లో 25 విజయాలు సాధించింది. ఇందులో రెండుసార్లు ఆసీస్‌ గడ్డపై సాధించిన టెస్టు సిరీస్‌ విజయాలు ఉండడం విశేషం. ఇక రవిశాస్త్రి 76 వన్డేల్లో 51 వన్డేలు, 65 టి20ల్లో 43 మ్యాచ్‌లు గెలిచింది.

చదవండి: Arjun Tendulkar: తండ్రి పేరు తొలగించుకుంటే మంచిది.. కనీసం 50 శాతమైనా!

Hardik Pandya-Ravi Shastri: ఇద్దరి బంధం ఎంతో ప్రత్యేకం.. అపూర్వ కలయిక 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top