భారత్‌, శ్రీలంక రెండో టీ20.. మ్యాచ్‌ జరిగేనా!

Rain likely to play spoilsport as India aim series win - Sakshi

స్వదేశంలో టీమిండియా మరో టీ20 సిరీస్‌పై కన్నేసింది. ధర్మశాల వేదికగా శ్రీలంకతో రెండో టీ20లో శనివారం భారత్‌ తలపడనుంది. ఇప్పటికే తొలి టీ20లో విజయం సాధించిన టీమిండియా.. రెండో టీ20లో గెలుపొంది సిరీస్‌ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అయితే భారత్‌- శ్రీలంక రెండో టీ20కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశముంది. గత మూడు రోజులుగా ధర్మశాలలో వర్షాలు  కురుస్తున్నాయి.

ఈ రోజు కూడా చిరు జల్లులు పడే అవకాశం ఉందట. ఆకాశం మేఘావృతంగా ఉండనుంది. శనివారం వర్షం పడే అవకాశాలు కేవలం 60 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే  వర్షం పడి మైదానం చిత్తడిగా మారింది. దీంతో పిచ్‌పై గ్రౌండ్‌ స్టాప్‌ కవర్లు వేసి  ఉంచారు. ఒక వేళ వర్షం పడితే మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేసే అవకాశం లేకపోలేదు.

భారత్ తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), సంజు శాంసన్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా / కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), యుజ్వేంద్ర చాహల్

శ్రీలంక జట్టు (అంచనా): దనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వైస్‌ కెప్టెన్‌), చరిత్ అసలంక, దసున్ షనక (కెప్టెన్‌), బినుర ఫెర్నాండో, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, ప్రవీణ్ జయవిక్రమ, జెఫ్రీ వాండర్సే, లాహిరు కూమార

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top