ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన మాజీ క్రికెటర్‌ కొడుకు | Rai Benjamin, Son Of Former West Indian Pacer Winston Benjamin, Recently Secured Gold Medal For USA In Paris Olympics | Sakshi
Sakshi News home page

ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన మాజీ క్రికెటర్‌ కొడుకు

Aug 12 2024 5:15 PM | Updated on Aug 12 2024 6:37 PM

Rai Benjamin, Son Of Former West Indian Pacer Winston Benjamin, Recently Secured Gold Medal For USA In Paris Olympics

పారిస్‌ ఒలింపిక్స్‌లో వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ విన్‌స్టన్ బెంజమిన్ కొడుకు రాయ్ బెంజమిన్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. విశ్వక్రీడల్లో యూఎస్‌ఏకు ప్రాతినిథ్యం వహించిన రాయ్‌.. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో 46.46 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో రాయ్‌ ప్రపంచ రికార్డు హోల్డర్, నార్వేకు చెందిన కార్స్టన్ వార్హోమ్‌ను ఓడించి పసిడి పతకం​ నెగ్గాడు.

రాయ్‌ ఒలింపిక్స్‌ స్వర్ణం సాధించడం పట్ల తండ్రి విన్‌స్టన్ ఎనలేని ఆనందం వ్యక్తం చేశాడు. తన కొడుకు సాధించిన విజయాన్ని విన్‌స్టన్‌ ప్రపంచ కప్ ఫైనల్ గెలుపుతో పోల్చాడు. రాయ్ ఈ విజయం సాధించడానికి ఎంతో కష్టపడ్డాడని విన్‌స్టన్‌ తెలిపాడు. రాయ్ విజయం యునైటెడ్ స్టేట్స్‌కే కాకుండా తాను పుట్టి పెరిగిన ఆంటిగ్వాకు కూడా కీర్తి ప్రతిష్టలు తెచ్చిందని విన్‌స్టన్‌ అన్నాడు.

59 ఏళ్ల విన్‌స్టన్‌ 80, 90 దశకాల్లో వెస్టిండీస్‌ తరఫున 21 టెస్ట్‌లు, 85 వన్డేలు ఆడి 161 వికెట్లు తీశాడు. లోయర్‌ ఆర్డర్‌లో ఉపయోగకరమైన బ్యాటర్‌ కూడా అయిన విన్‌స్టన్‌ టెస్ట్‌ల్లో రెండు హాఫ్‌ సెంచరీలు చేశాడు. 27 ఏళ్ల రాయ్‌ బెంజమిన్‌.. విన్‌స్టన్‌ ఆరుగురు సంతానంలో ఒకరు. రాయ్‌ టోక్యో ఒలింపిక్స్‌లో రజతం​ సాధించాడు. చిన్నతనంలో క్రికెట్‌ పట్ల ఆకర్శితుడైన రాయ్‌.. ఆతర్వాత మనసు మార్చుకుని ట్రాక్‌ ఆండ్‌ ఫీల్డ్‌ గేమ్స్‌ వైపు మళ్లాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement