పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాటర్‌పై నిషేధం | PSL 2026: Fakhar Zaman handed two match ban for ball tampering | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాటర్‌పై నిషేధం

Mar 31 2026 5:23 PM | Updated on Mar 31 2026 5:26 PM

PSL 2026: Fakhar Zaman handed two match ban for ball tampering

పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాటర్‌ ఫకర్‌ జమాన్‌ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2026లో బాల్‌ టాంపరింగ్‌ ఆరోపణలు రుజువు కావడంతో లీగ్‌ యాజమాన్యం ఇతనిపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. పీఎస్‌ఎల్‌లో లాహోర్‌ ఖలందర్స్‌కు ఆడే జమాన్‌.. మార్చి 29న  కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం టీవీ స్క్రీన్లలోనూ స్పష్టం కనిపించింది.

అయితే జమాన్‌ ఈ ఆరోపణలు ఖండించాడు. తాను ఎలాంటి బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడలేదని అన్నాడు. దీంతో మ్యాచ్‌ రిఫరి రోషన్‌ మహానామా రంగంగలోకి దిగి విచారణ చేపట్టారు. ఇందులో జమాన్‌ దోషిగా తేలడంతో నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. బాల్‌ టాంపరింగ్‌ అంశం పీఎస్‌ఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌లోని లెవల్‌–3 ఉల్లంఘన కిందకు వస్తుంది. ఇందుకు శిక్ష రెండు మ్యాచ్‌ల నిషేధం.

నిషేధం ప్రకటనలో జమాన్‌ ఏప్రిల్‌ 3న ముల్తాన్‌ సుల్తాన్స్‌తో, ఏప్రిల్‌ 9న ఇస్లామాబాద్‌ యునైటెడ్‌తో జరుగనున్న మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.  

అసలేం జరిగిందంటే..?
క‌రాచీ కింగ్స్ విజ‌యానికి చివ‌రి ఓవ‌ర్‌లో 14 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. ఈ  ఓవ‌ర్ వేసే బాధ్య‌త‌ను కెప్టెన్ షాహీన్ అఫ్రిది పేస‌ర్ హ‌రీస్ ర‌వూఫ్‌కు అప్ప‌గించాడు. అయితే ఈ క్ర‌మంలో ఫకర్ జమాన్, అఫ్రిది, రవూఫ్ ముగ్గురూ కలిసి బౌలర్ ఎండ్ వ‌ద్ద‌ మాట్లాడుకున్నారు. ఈ స‌మ‌యంలో బంతికి ఒక‌రు చేతి నుంచి ఒకరు మార్చుకున్నారు.

అయితే బంతిని ఫ‌కర్ త‌న చేతి వేలితో గీకిన‌ట్లు కనిపించింది. దీంతో వెంట‌నే అంపైర్ బంతిని అత‌డి చేతి నుంచి తీసుకుని  టాంపరింగ్‌కు గురైనట్లు నిర్ధారించారు. ఈ క్ర‌మంలో బంతిని మార్చ‌డంతో పాటు ల‌హోర్‌కు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. దీంతో మ్యాచ్ ఫ‌లితమే తారుమారైంది. జమాన్‌ జట్టు ఓటమిపాలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement