జాతీయ విధులకు ఆసీస్‌ స్టార్లు డుమ్మా | Peake, Scott, Davies earn maiden Australia call-ups for subcontinent tours | Sakshi
Sakshi News home page

జాతీయ విధులకు ఆసీస్‌ స్టార్లు డుమ్మా

May 11 2026 9:10 AM | Updated on May 11 2026 11:27 AM

Peake, Scott, Davies earn maiden Australia call-ups for subcontinent tours

ఐపీఎల్‌ 2026 కారణంగా పలువురు ఆసీస్‌ స్టార్‌ ఆటగాళ్లు జాతీయ విధులకు డుమ్మా కొట్టారు. త్వరలో జరుగబోయే పాక్‌, బంగ్లాదేశ్‌ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు జట్లను ప్రకటించగా.. అందులో పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, మార్కస్‌ స్టోయినిస్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ తదితరుల పేర్లు కనిపించలేదు.

అండర్‌-19 జట్టు సారధి ఓల్లీ పీక్‌ తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపునందుకున్నాడు. ఇతను పాకిస్తాన్‌తో జరిగే వన్డే సిరీస్‌కు మాత్రమే ఎంపికయ్యాడు. ఐపీఎల్‌ స్టార్లు రిటర్న్‌ రావడంతో బంగ్లాదేశ్‌ సిరీస్‌కు పీక్‌ను ఎంపిక చేయలేదు.

కమిన్స్‌ గైర్హాజరీలో మిచెల్‌ మార్ష్‌ రెండు సిరీస్‌లకు (పాక్‌, బంగ్లాదేశ్‌) కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అలాగే ఇంగ్లిస్‌, గ్రీన్‌లకు మూడు జట్లలో చోటు దక్కింది. స్టోయినిస్‌, మ్యాక్స్‌వెల్‌ బంగ్లాదేశ్‌ సిరీస్‌కు అందుబాటులో ఉన్నా సెలెక్టర్లు పట్టించుకోలేదు. వెటరన్‌ స్టార్‌ స్టీవ్‌ స్మిత్‌కు కూడా మూడు జట్లలో చోటు దక్కలేదు. ట్రవిస్‌ హెడ్‌ బంగ్లాదేశ్‌ వన్డే, టీ20 సిరీస్‌లకు మాత్రమే ఎంపికయ్యాడు.

ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లతో ఉన్న కూపర్‌ కన్నోల్లీ, డ్వార్షుయిస్‌, బార్ట్‌లెట్‌ను కూడా పాక్‌ వన్డే సిరీస్‌కు ఎంపిక చేయలేదు. కాగా, ఐపీఎల్‌ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు పాక్‌ పర్యటనకు వెళ్తుంది. ఆ పర్యటనలో మే 30, జూన్‌ 2, 4 తేదీల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి.

పాకిస్తాన్ వన్డేల కోసం ఆస్ట్రేలియా జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కునెమాన్, మార్నస్ లాబుషేన్, రైలీ మెరెడిత్, ఆలివర్ పీక్, మాథ్యూ రెన్‌షా, తన్వీర్ సంఘా, లియామ్ స్కాట్, మాట్ షార్ట్, బిల్లీ స్టాన్లేక్, ఆడమ్ జంపా

అనంతరం ఆస్ట్రేలియా జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌కు వెళ్తుంది. ఈ పర్యటనలో వన్డేలు జూన్‌ 9, 11, 14 తేదీల్లో.. టీ20లు 17, 19, 21 తేదీల్లో జరుగన్నాయి.

బంగ్లాదేశ్ వన్డేల కోసం ఆస్ట్రేలియా జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కానలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కునెమాన్, మార్నస్ లాబుషేన్, మాథ్యూ రెన్‌షా, తన్వీర్ సంఘా, లియామ్ స్కాట్, ఆడమ్ జంపా

బంగ్లాదేశ్ టీ20ల కోసం ఆస్ట్రేలియా జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కానలీ, టిమ్ డేవిడ్, జోయెల్ డేవిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మాథ్యూ కుహ్నెమాన్, రిలే మెరెడిత్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్‌షా, ఆడమ్ జంపా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement