పాకిస్తాన్‌ ఆలౌట్‌.. బంగ్లాదేశ్‌కు ఆధిక్యం | Pakistan all out for 386 runs in first innings against bangladesh | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ ఆలౌట్‌.. బంగ్లాదేశ్‌కు ఆధిక్యం

May 10 2026 5:17 PM | Updated on May 10 2026 6:02 PM

Pakistan all out for 386 runs in first innings against bangladesh

ఢాకా వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌కు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం ఆటగాడు అజాన్‌ అవైస్‌ (103) సెంచరీతో కదంతొక్కగా.. అబ్దుల్లా ఫజల్‌ (60), సల్మాన్‌ అఘా (58), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (59) అర్ద సెంచరీలతో రాణించారు. 

మిగతా ఆటగాళ్లలో ఇమామ్‌ ఉల్‌ హక్‌ 45, కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ 9, సౌద్‌ షకీల్‌ డకౌట్‌, నౌమన్‌ అలీ 2, షాహీన్‌ అఫ్రిది 13, హసన్‌ అలీ 6, మొహమ్మద్‌ అబ్బాస్‌ 6 (నాటౌట్‌) పరుగులు చేశారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో మెహిది హసన్‌ మిరాజ్‌ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. తస్కిన్‌ అహ్మద్‌, తైజుల్‌ ఇస్లాం తలో 2, నహిద్‌ రాణా ఓ వికెట్‌ తీశారు.

అంతకుముందు బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 413 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ నజ్ముల్‌ హసన్‌ షాంటో (101) సెంచరీతో సత్తా చాటాడు. మొమినుల్‌ హక్‌ (91) సెంచరీ మిస్‌ అయ్యాడు. ముష్ఫికర్‌ రహీం (71) అర్ద సెంచరీతో రాణించాడు. 

మిగతా ప్లేయర్లలో మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌ 8, షద్మాన్‌ ఇస్లాం 13, లిటన్‌ దాస్‌ 33, మెహిద్‌ హసన్‌ మిరాజ్‌ 10, తైజుల్‌ ఇస్లాం 17, ఎబాదత్‌ హొసేన్‌ డకౌట్‌, తస్కిన్‌ అహ్మద్‌ 28, నహిద్‌ రాణా 4 (నాటౌట్‌) పరుగులు చేశారు. పాక్‌ బౌలర్లలో మొహమ్మద్‌ అబ్బాస్‌ 5 వికెట్లు పడగొట్టగా.. షాహీన్‌ అఫ్రిది 3, హసన్‌ అలీ, నౌమన్‌ అలీ తలో వికెట్‌ తీశారు. కాగా, పాకిస్తాన్‌ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం​ బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. 

34 పరుగుల ఆధిక్యంలో..!
27 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బంగ్లాదేశ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు ఆధిక్యం 34కు చేరింది. ఓపెనర్లు మహ్మదుల్‌ జాయ్‌ 2చ, షద్మాన్‌ 0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement