ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జేసన్ గిల్లెస్పి మరోసారి పాకిస్తాన్ క్రికెట్‌లో భాగమయ్యాడు. గతేడాది పాక్ టెస్టు జట్టు హెడ్‌కోచ్ పదవి నుంచి ఈ మాజీ పేసర్ వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నక్వీని కూడా తీవ్ర స్థాయిలో విమర్శించాడు. తనకు చెప్పకుండానే సీనియర్ అసిస్టెంట్ కోచ్‌పై వేటు వేశారని.. అవమానాన్ని భరించలేకే తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించాడు.
హైదరాబాద్ కింగ్స్‌మెన్ కోచ్‌గా
అయితే, అనూహ్య రీతిలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో గిల్లెస్పి భాగం కావడం విశేషం. మార్చి 26న తాజా ఎడిషన్ ఆరంభం కానున్న తరుణంలో కొత్త ఫ్రాంఛైజీ హైదరాబాద్ కింగ్స్‌మెన్ కోచ్‌గా అతడు బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో జట్టుతో చేరిన అతడు హోటల్‌లో కెమెరామెన్‌తో సంభాషించిన తీరు వైరల్‌గా మారింది.
ఫ్రాంఛైజీ క్రికెట్‌లో స్వాగత వీడియోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆటగాళ్లు, కోచ్‌ల ఆగమనం నేపథ్యంలో వీడియోలు తీసి వాటికి ఎలివేషన్లు ఇవ్వడం పరిపాటి. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఫ్రాంఛైజీ వెల్‌కమ్ వీడియో తీస్తున్న క్రమంలో గిల్లెస్పి కీలక వ్యాఖ్యలు చేశాడు.
స్టుపిడ్ వెల్‌కమ్ వీడియోలు వద్దు
‘‘నేనేమీ కిందకు రావడం లేదు. నాకు చాలా పని ఉంది. ఇలాంటి స్టుపిడ్ వెల్‌కమ్ వీడియోలు నేను చేయను’’ అంటూ పై అంతస్తులో ఉన్న గిల్లెస్పి వ్యాఖ్యానించాడు. తనకు పని ఎక్కువగా ఉందని.. కాబట్టి ఇలాంటి వాటిలో తాను భాగం కాలేనని తిరస్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
🚨 ANOTHER EMBARRASSMENT FOR PSL
Jason Gillespie refuses to shoot CRINGE 'WELCOME VIDEOS'
"I am not coming down. I have a lot of work to do. I'm not gonna shoot those stupid welcome videos."
Man chose actual work over scripted cringe. Priorities. 🤣🤡 pic.twitter.com/iYmDhcFRKN— Brutal Truth (@sarkarstix) March 24, 2026
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ ఫ్రాంఛైజీతో కలిసి పనిచేసేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు గిల్లెస్పి పేర్కొన్నాడు. జట్టును విజయపథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నాడు. అందుకు తగ్గట్లుగానే ఏమాత్రం సమయం వృథా చేయకుండా శిక్షణపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
చదవండి: రూ. 15 వేల కోట్లకు అమ్మకం.. షేన్ వార్న్ వాటా ఎంతంటే?


