హార్దిక్‌ పాండ్యా కూడా..! | Mumbai Captain Hardik Pandya Hints At Stepping Down From Captaincy | Sakshi
Sakshi News home page

హార్దిక్‌ పాండ్యా కూడా..!

May 30 2026 9:12 AM | Updated on May 30 2026 9:12 AM

Mumbai Captain Hardik Pandya Hints At Stepping Down From Captaincy

ఐపీఎల్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న పంత్‌ బాటలో ముంబై సారథి హార్దిక్‌ పాండ్యా కూడా నాయకత్వానికి గుడ్‌బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. ‘మానసికంగా తీవ్రంగా అలసిపోయిన’ హార్దిక్‌ ఈ బాధ్యతల బరువునుంచి తప్పించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

లక్నో తరహాలోనే ముంబై కూడా 4 మ్యాచ్‌ల్లో గెలిచి, 10 మ్యాచ్‌ల్లో ఓడింది. అయితే స్వల్పంగా మెరుగైన రన్‌రేట్‌ ఉండటంతో 9వ స్థానంతో ముగించింది. ముంబై ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలు కోల్పోయిన రోజే తాను కెప్టెన్సీ వదిలేయాలని భావిస్తున్న విషయాన్ని హార్దిక్‌ టీమ్‌ యాజమాన్యంతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన పాండ్యా గాయం కారణంగా 4 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతని సారథ్యంలో 2024లో చివరి స్థానంలో నిలిచిన ముంబై... గత ఏడాది ‘ప్లే ఆఫ్స్‌’కు అర్హత సాధించి మూడో స్థానంతో ముగించింది. 

Advertisement
 
Advertisement
Advertisement