అత్యధిక నోబాల్స్‌ వేసిందెవరంటే?

Most No-balls In International Cricket  - Sakshi

టీమిండియా ఫాస్ట్‌బౌలర్‌ అర్ష‌దీప్ సింగ్ టి20ల్లో ఊహించని రికార్డు నమోదు చేశాడు. అత్య‌ధిక నో బాల్స్ వేసిన బౌల‌ర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. గురువారం శ్రీ‌లంక‌తో జ‌రిగిన రెండో టీ20లో అర్ష‌దీప్ ఏకంగా 5 నో బాల్స్ వేశాడు. తొలి ఓవ‌ర్‌లో మూడు, ఆఖ‌రి ఓవ‌ర్‌లో రెండు నో బాల్స్ వేశాడు. దాంతో, ఒక ఇన్నింగ్స్‌లో ఎక్కువ నో బాల్స్ వేసిన భార‌త బౌల‌ర్‌గా గుర్తింపు సాధించాడు.  గ‌తంలో అత‌ను ద‌క్షిణాఫ్రికా మీద 4 నో బాల్స్ వేశాడు.

ఇప్ప‌టివ‌ర‌కు అర్ష్‌దీప్‌ 11ఇన్నింగ్స్‌ల్లో 14 నో బాల్స్ వేశాడు.  ఈ జాబితాలో పాకిస్థాన్ బౌల‌ర్ హ‌స‌న్ అలీ రెండో స్థానంలో ఉన్నాడు. హ‌స‌న్ 9 ఇన్నింగ్స్‌ల్లో 11 నో బాల్స్ వేశాడు. ఇక వెస్టిండీస్‌ బౌలర్‌ కీమో పాల్‌ ఆరు ఇన్సింగ్స్‌ల్లో 11 నో బాల్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు.  ఇక ఇదే విండీస్‌కు చెందిన మ‌రో బౌల‌ర్ ఒషానే థామ‌స్ కూడా 11 నో బాల్స్ వేశాడు. అత్య‌ధిక నో బాల్స్ వేసిన జ‌ట్టుగా ఘ‌నా నిలిచింది. ఉగాండాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఘ‌నా బౌల‌ర్లు ఏకంగా 10 నో బాల్స్ వేశారు.

నో బాల్ వేయ‌ని క్రికెట‌ర్స్
అంత‌ర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ కాలం ఆడి, ఒక్క నో బాల్ కూడా వేయ‌ని బౌల‌ర్లు కొంద‌రు ఉన్నారు. వీళ్ల‌లో భార‌త మాజీ క్రికెట‌ర్ 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో క‌పిల్ దేవ్ కూడా ఉన్నాడు. అత‌ను 131 టెస్టులు, 225 వ‌న్డేలు ఆడాడు. 79 టెస్టులు, 3 వ‌న్డేలు ఆడిన వెస్టిండీస్ లెజెండరీ స్పిన్స‌ర్‌ లాన్సే గిబ్స్ త‌న కెరీర్‌లో ఒక్క నో బాల్ వేయ‌లేదు. ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండ‌ర్ ఇయాన్ బోథాం త‌న 16 ఏళ్ల కెరీర్‌లో నో బాల్ అస్స‌లు వేయ‌లేదు. 70 టెస్టులు, 63 వ‌న్డేలు ఆడిన ఆస్ట్రేలియ‌న్ ఫాస్ట్ బౌల‌ర్ డెన్నిస్ లిల్లీ ఖాతాలో నో బాల్ అనేదే లేదు. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ ఇమ్రాన్ ఖాన్ 88 టెస్టులు, 175 వ‌న్డేల్లో నో బాల్ వేయ‌లేదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top