మహ్మద్‌ రిజ్వాన్‌ సంచలన వ్యాఖ్యలు | Mohammad Rizwan Officially Declares Open To Retirement | Sakshi
Sakshi News home page

మహ్మద్‌ రిజ్వాన్‌ సంచలన వ్యాఖ్యలు

Apr 19 2026 12:57 PM | Updated on Apr 19 2026 1:23 PM

Mohammad Rizwan Officially Declares Open To Retirement

పాకిస్తాన్‌ స్టార్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో పేలవ ఫామ్‌లో ఉన్న అతను.. విలేకరుల నుంచి రిటైర్మెంట్‌పై ఎదురైన ప్రశ్నలపై స్పందిస్తూ, తానెప్పుడు దానికి రెడీ అంటూ ఆసక్తికర సమాధానం చెప్పాడు.

ఈ పీఎస్‌ఎల్‌ సీజన్‌లో కొత్త ఫ్రాంచైజీ రావల్పిండ్జ్‌కు సారథ్యం వహిస్తున్న రిజ్వాన్‌.. కెప్టెన్‌గా, వ్యక్తిగతంగా దారుణంగా విఫలమయ్యాడు. భారీ అంచనాల మధ్య పీఎస్‌ఎల్‌లోకి అడుగుపెట్టిన రావల్పిండ్జ్‌ ఈ సీజన్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది. తద్వారా ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగానూ నిలిచింది.

రిజ్వాన్‌ ఈ సీజన్‌లో ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం 107 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. తాజాగా లాహోర్‌ ఖలందర్స్‌ చేతిలో ఓటమి అనంతరం విలేకరులు రిజ్వాన్‌ రిటైర్మెంట్‌ ప్రస్తావన తెచ్చారు. ఇందుకు ఆయన బదులిస్తూ.. 

అవును నా ప్రదర్శన బాగా లేదు. ఇందుకు అంగీకరిస్తాను. నేను విమర్శల​కు భయపడను. ప్రజలు నేను రిటైరవ్వాలనుకుంటే తప్పక వైదొలుగుతాను. ఈ విషయాన్ని గతంలోనూ చాలా సార్లు చెప్పాను. నేను ప్రశ్నలకు గానీ, మీడియాకు కానీ భయపడను. నా లోపం ఉంటే తప్పక అంగీకరిస్తానని అన్నాడు.

కాగా, రిజ్వాన్‌ పీఎస్‌ఎల్‌లోనే కాక అంతర్జాతీయ స్థాయిలో సైతం​ గత కొంతకాలంగా దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ కారణం​గా అతను టీ20 జట్టులో చోటును కూడా కోల్పోయాడు. విదేశీ లీగ్‌ల్లో సైతం​ తేలిపోతున్నాడు. రిజ్వాన్‌ పీఎస్‌ఎల్‌లో కెప్టెన్‌గా గత 17 మ్యాచ్‌ల్లో 16 మ్యాచ్‌లు ఓడిపోయాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement