ఆర్సీబీకి గుడ్ న్యూస్‌.. స్టార్‌ బౌలర్‌ వచ్చేస్తున్నాడు? | Massive Update On Josh Hazlewoods Return Ahead Of RCB vs CSK Match | Sakshi
Sakshi News home page

IPL 2026: ఆర్సీబీకి గుడ్ న్యూస్‌.. స్టార్‌ బౌలర్‌ వచ్చేస్తున్నాడు?

Apr 3 2026 7:11 PM | Updated on Apr 3 2026 7:15 PM

Massive Update On Josh Hazlewoods Return Ahead Of RCB vs CSK Match

ఐపీఎల్‌-2026 తొలి మ్యాచ్‌లో గెలిచి మంచి జోష్ మీద ఉన్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు గుడ్ న్యూస్ అందింది. స్టార్ పేస‌ర్ జోష్ హాజిల్‌వుడ్ ఊహించిన దానికంటే ముందుగానే తిరిగి మైదానంలో అడుగుపెట్టే అవ‌కాశ‌ముంది. హాజిల్‌వుడ్ ప్రస్తుతం తొడకండరాల గాయంతో బాధపడున్నాడు.

దీంతో యాషెస్ సిరీస్‌, టీ20 ప్రపంచకప్‌-2026కు దూరమయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్ నుంచి కూడా వైదొలగనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ హాజిల్‌వుడ్ మాత్రం భారత్‌కు వచ్చి ఆర్సీబీ జట్టుతో చేరాడు. అయితే ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు ఆర్సీబీ హెడ్ కోచ్ అండీ ఫ్లవర్ ధ్రువీకరించాడు.

అయితే ఇప్పుడు హాజిల్‌వుడ్ తన ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాడు. చిన్నస్వామి స్టేడియం నెట్స్‌లో జోష్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. చాలా రోజుల తర్వాత పూర్తి రిథమ్‌తో బౌలింగ్ చేయడంతో దాదాపుగా అతడు పూర్తి సాధించినట్లు కన్పిస్తున్నాడు. ఏప్రిల్ 10న గువాహటిలో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు హాజిల్‌వుడ్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. హాజిల్‌వుడ్ పునరాగమనం చేస్తే ఆర్సీబీ బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుంది. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 5న సీఎస్‌కేతో తలపడనుంది.
చదవండి: IPL 2026: అజింక్య ర‌హానేకు భారీ షాక్‌.. కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ?

Advertisement
 
Advertisement
Advertisement