అజింక్య ర‌హానేకు భారీ షాక్‌.. కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ? | Rinku Singh Set To Replace Ajinkya Rahane As KKR Captain Midway in IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: అజింక్య ర‌హానేకు భారీ షాక్‌.. కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ?

Apr 3 2026 5:53 PM | Updated on Apr 3 2026 6:36 PM

Rinku Singh Set To Replace Ajinkya Rahane As KKR Captain Midway in IPL 2026

ఐపీఎల్‌-2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా రెండో ఓటమిని మూటకట్టుకుంది. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో ‍కేకేఆర్ చిత్తు అయింది.  2012 తర్వాత కేకేఆర్ వరుసగా మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి.

దీంతో అజింక్య రహానే కెప్టెన్సీపై సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. గత సీజన్‌లో కూడా కేకేఆర్‌ను విజయపథంలో రహానే నడిపించలేకపోయాడు. కనీసం ప్లే ఆఫ్స్‌కు చేరుకుండానే కేకేఆర్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈసారి కూడా అదే సూచనలు కన్పిస్తున్నాయి.

రహానేపై వేటు?
ఈ క్రమంలో అజింక్యా రహానేను సీజన్‌ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పించే ఆలోచనలో కేకేఆర్ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. రహానే స్ధానంలో స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ జట్టు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని 'రాయ్‌స్పోర్ట్స్' ప్రతినిధి సందీపన్ బెనర్జీ పేర్కొన్నారు. రింకూ ప్రస్తుతం కేకేఆర్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో కూడా రహానే గాయంతో మైదానం వీడినప్పుడు రింకూ కెప్టెన్సీ బాధ్యతలు చేప‌ట్టాడు.

కానీ  221 పరుగుల భారీ ఛేదనను అడ్డుకోవడంలో అతను విఫలమయ్యాడు. కానీ రింకూ సింగ్‌కు మాత్రం కెప్టెన్‌గా అనుభ‌వం ఉంది. 2024-25 డొమాస్టిక్ సీజ‌న్‌లో యూపీ జ‌ట్టు కెప్టెన్‌గా రింకూ వ్య‌వ‌హ‌రించాడు. ఈ క్ర‌మంలోనే అత‌డికి పూర్తి స్ధాయి బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించాల‌ని కేకేఆర్ మేనెజ్‌మెంట్ భావిస్తున్న‌ట్లు సమాచారం.

త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై ర‌హానే స్పందించాడు. ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్ అనంత‌రం ర‌హానే మాట్లాడుతూ.. నేను ఆడటం కొందరికి ఇష్టం లేదు.  నా విజయాలను చూసి వారు అసూయపడుతున్నారు. నేను బ‌య‌ట వ్య‌క్తుల మాట‌ల‌ను ప‌ట్టించుకోను. నేను ఏం చేస్తున్నానో మీ అందరికీ తెలుసు.  కేవలం ఒక ఇన్నింగ్స్ విఫలమైతే విమర్శలు చేయడం సరికాదు అని పేర్కొన్నాడు.
చదవండి: PSL 2026: ఉన్నపళంగా పాక్‌ నుంచి వెళ్లిపోయిన డేవిడ్‌ వార్నర్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement