
దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌కు ఐపీఎల్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. గాయంతో ఐపీఎల్ టోర్నీకి దూరమైన బౌలర్ ప్రసిధ్ కృష్ణ స్థానంలో రాజస్తాన్ రాయల్స్ జట్టు కేశవ్ ను అతని కనీస ధర రూ. 50 లక్షలకు జట్టులోకి తీసు కుంది.
34 ఏళ్ల కేశవ్ దక్షిణాఫ్రికా తరఫున 27 టి20లు, 44 వన్డేలు, 50 టెస్టులు ఆడి మొత్తం 237 వికెట్లు తీశాడు. మరోవైపు గాయపడ్డ ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ అఫ్గానిస్తాన్‌కు చెందిన 16 ఏళ్ల స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్‌ను జట్టులోకి తీసుకుంది.