కైయా సెంచరీ.. పట్టు బిగించిన జింబాబ్వే | Kaia ton leads Zimbabwe charge as hosts tighten grip on Day 2 | Sakshi
Sakshi News home page

కైయా సెంచరీ.. పట్టు బిగించిన జింబాబ్వే

Jun 30 2026 7:52 AM | Updated on Jun 30 2026 7:52 AM

Kaia ton leads Zimbabwe charge as hosts tighten grip on Day 2

హరారే వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో జింబాబ్వే పట్టు బిగించింది. ఓపెనర్‌ ఇన్నోసెంట్‌ కైయా కెరీర్‌లో మొదటి శతకంతో (140) కదంతొక్కడంతో 270 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను 140 పరుగులకే ఆలౌట్ చేసి.. తమ తొలి ఇన్నింగ్స్‌లో 410 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బంగ్లాదేశ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 40 పరుగులు చేసింది. షద్మాన్‌ ఇస్లాం 9 పరుగులకు ఔట్‌ కాగా.. మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌ 21, మొమినుల్‌ హక్‌ 9 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు బంగ్లాదేశ్‌ ఇంకా 230 పరుగులు వెనుకపడి ఉంది.

జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కైయాతో పాటు బ్రియాన్‌ బెన్నెట్‌ (59), క్రెయిగ్‌ ఎర్విన్‌ (60), వెస్లీ మదెవెరె (77 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించగా.. బెన్‌ కర్రన్‌ 42 పరుగులతో పర్వాలేదనిపించాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్‌ ఇస్లాం 7 వికెట్లతో సత్తా చాటగా.. ఖలీద్‌ అహ్మద్‌ 2 వికెట్లు తీశాడు.

అంతకుముందు జింబాబ్వే బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో బంగ్లాదేశ్‌ స్వల్ప స్కోర్‌కే ఆలౌటైంది. న్యూమ్యాన్‌ న్యామ్హురి 4, కెప్టెన్‌ రిచర్డ్‌ నగరవ, బ్లెస్సింగ్‌ ముజరబానీ, బ్రాడ్‌ ఈవాన్స్‌ తలో 2 వికెట్లతో సత్తా చాటారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మొమినుల్‌ హక్‌ (60) మాత్రమే అర్ద సెంచరీతో రాణించగా.. షద్మాన్‌ (20), కెప్టెన్‌ షాంటో (19) మాత్రమే అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు.

తైజుల్‌ ట్రిపుల్‌ సెంచరీ
తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసి జింబాబ్వేను ఇబ్బంది పెట్టిన బంగ్లా స్పిన్నర​్‌ తైజుల్‌ ఇస్లాం తన అంతర్జాతీయ కెరీర్‌లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఒక్క టెస్ట్‌ల్లోనే 270 వికెట్లు తీసిన అతడు.. వన్డేల్లో 31, టీ20ల్లో ఓ వికెట్‌ తీశాడు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement