జాతీయ క్రీడల్లో జ్యోతి యర్రాజీకి స్వర్ణం.. ఆంధ్రప్రదేశ్‌ ఖాతాలో మూడవది 

Jyothi Yarraji Bags Gold In 100m Hurdles, Breaks Own National Games Record - Sakshi

పనాజీ: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు మూడో స్వర్ణ పతకం లభించింది. సోమవారం జరిగిన అథ్లెటిక్స్‌ ఈవెంట్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి యర్రాజీ చాంపియన్‌గా అవతరించింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 13.22 సెకన్లలో అందరికంటే వేగంగా ఫైనల్‌ రేసును ముగించి అగ్రస్థానంలో నిలిచింది.

మరోవైపు తెలంగాణ ఖాతాలో 11వ పతకం చేరింది. మహిళల స్విమ్మింగ్‌ 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌లో వ్రితి అగర్వాల్‌ రజత పతకం సాధించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top