‘నువ్వొక అద్భుతం.. ప్రపంచం నీ పాదాల చెంతకు’ | Jos Buttler Praises Vaibhav Suryavanshi Video Went Viral, Predicts He’ll Rule World Cricket In Coming Decade | Sakshi
Sakshi News home page

IPL 2026: ‘నువ్వొక అద్భుతం.. ప్రపంచం నీ పాదాల చెంతకు’

Apr 4 2026 12:27 PM | Updated on Apr 4 2026 12:54 PM

Jos Buttler Praise Vaibhav Sooryavanshi Will-Be Future Star Cricketer

గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌.. రాజస్తాన్‌ రాయల్స్‌ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించాడు. రాబోయే దశాబ్దంలో వైభవ్ ప్రపంచ క్రికెట్‌ను శాసించే అవకాశముందని జోస్యం చెప్పాడు. 15 ఏళ్ల సూర్యవంశీ ఆటతీరుకు తాను ముగ్దుడినయ్యానని బట్లర్ పేర్కొన్నాడు. 

ఇవాళ గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో బట్లర్‌ సూర్యవంశీతో సరదాగా సంభాషించిన వీడియోను రాజస్తాన్‌ యాజమాన్యం షేక్‌ చేసుకుంది. వీడియోలో బట్లర్ మాట్లాడుతూ.. ‘నేను చూసిన అత్యుత్తమ ఆటగాళ్లలో వైభవ్ ఒకడు. వైభవ్‌కు 21 లేదా 25 ఏళ్లు వచ్చేసరికి ప్రపంచం అతని పాదాల చెంత ఉంటుంది. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో మీరు మా ఇంగ్లండ్ జట్టు హృదయాన్ని ముక్కలు చేశారు. 

హరారే వేదికగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో నువ్వు ఆడిన 175 పరుగుల  ప్రపంచ రికార్డు ఇన్నింగ్స్‌  ఇప్పటికీ నా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఆరోజు నువ్వు చాలా బాగా ఆడావు. నీ ఆట చాలా బాగుంది. ఇదే స్వేచ్ఛతో కష్టపడి ఆడే తత్వాన్ని కొనసాగించు. భవిష్యత్తులో నువ్వు గొప్ప క్రికెటర్‌ అవుతావు. అందులో ఎలాంటి సందేహం లేదు.’ వైభవ్‌ను పొగడ్తల్లో ముంచడంతో పాటు విలువైన సూచనలు కూడా ఇచ్చాడు. 

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు బట్లర్ పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 బంతుల్లో 38 పరుగులు చేశాడు. 

ఐపీఎల్‌లో ఇప్పటివరకు 122 మ్యాచ్‌లు ఆడిన బట్లర్, దాదాపు 40 సగటుతో, 149 స్ట్రైక్ రేట్‌తో 4,158 పరుగులు చేశాడు. బట్లర్‌ ఫామ్‌పై విమర్శలు వస్తున్న వేళ ఒక్క ఇన్నింగ్స్‌తో వాటికి సమాధానం చెబుతాడేమో చూడాలి.

చదవండి: పంజాబ్ సిక్సర్ల మోత వెనుక ర‌హ‌స్య‌మిదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement