పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. టీమిండియాకు గుడ్‌ న్యూస్‌! బుమ్రా వచ్చేశాడు | Asia Cup 2023: Jasprit Bumrah Rejoins Indian Team Ahead Of Pakistan Clash In Super 4 - Sakshi
Sakshi News home page

Asia Cup 2023: పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. టీమిండియాకు గుడ్‌ న్యూస్‌! బుమ్రా వచ్చేశాడు

Sep 8 2023 12:24 PM | Updated on Sep 8 2023 1:39 PM

Jasprit Bumrah Rejoins Team Ahead Of Asia Cup Super 4 Clash Vs Pakistan - Sakshi

ఆసియాకప్‌-2023లో మరోసారి దాయాదుల పోరుకు సమయం అసన్నమైంది. సూపర్‌-4లో భాగంగా ఆదివారం  కొలంబో వేదికగా భారత్‌-పాకిస్తాన్‌ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌కు ముందు భారత అభిమానులకు ఓ గుడ్‌న్యూస్‌. తనకు కొడుకు పుట్టిన కారణంగా స్వదేశానికి వెళ్లిన స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా తిరిగి జట్టుతో కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అతడు శుక్రవారం భారత జట్టు శిబరంలో చేరినట్లు తెలుస్తోంది. ఇక ఈ మ్యాచ్‌కు  టీమిండియా స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ కూడా అందుబాటులో ఉండనున్నాడు. ఇప్పటికే జట్టుతో కలిసిన రాహుల్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో బీజీబీజీగా ఉన్నాడు. ఒకవేళ రాహుల్‌కు తుది జట్టులో చోటు దక్కితే ఇషాన్‌ కిషన్‌ గానీ శ్రేయస్‌ అయ్యర్‌ గానీ బెంచ్‌కు పరిమితవ్వాల్సి వస్తుంది.

మరోవైపు ఈ మ్యాచ్‌లో కూడా మహ్మద్‌ షమీని కొనసాగించే ఛాన్స్‌ ఉం‍ది. నేపాల్‌తో మ్యాచ్‌కు బుమ్రా దూరం కావడంతో షమీ తన స్ధానంలో జట్టులోకి వచ్చాడు. అయితే కొలంబో లోని ప్రేమదాస స్టేడియం పేసర్లకు కాస్త అనుకూలిస్తుంది. కాబట్టి షమీని అదనపు సీమర్‌గా తీసుకోవాలని జట్టు మెనెజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శార్ధూల్‌ ఠాకూర్‌పై వేటు వేయనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది.

భారత తుది జట్టు (అంచనా) : రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
చదవండి: Dhoni With Trump: డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడిన ధోని.. వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement