ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ అందింది. మొన్నటివరకు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఉన్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి ముంబై జట్టులో చేరాడు. వాంఖడే స్టేడియంలో ముంబై ట్రైనింగ్ క్యాంపులో బుమ్రా కన్పించకపోవడంతో ఏమైనా గాయపడ్డాడా? అన్న అనుమానాలు తలెత్తాయి.
కానీ బుమ్రా ఇప్పుడు జట్టుతో చేరి ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాడు. మార్చి 29న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరగనున్న ముంబై తొలి మ్యాచ్‌లో బుమ్రా బరిలోకి దిగనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు కీలక ఆటగాళ్లు విల్ జాక్స్, మిచెల్ శాంట్నర్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ను పూర్తి చేసుకున్న శాంట్నర్ ఇంకా న్యూజిలాండ్‌లోనే ఉన్నాడు.
మరోవైపు టీ20 ప్రపంచకప్-2026లో నాలుగు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న విల్ జాక్స్ కూడా ఇంకా ముంబై జట్టుతో చేరలేదు. దీంతో తుది జట్టులో కరేబియన్ ఆల్‌రౌండర్ షేర్ఫన్ 4 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకుని ఫామ్‌లో ఉన్నాడు. అతడి స్థానంలో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
తొలి మ్యాచ్‌లో ముంబై గెలుస్తుందా?
కాగా ముంబై ఇండియన్స్‌కు తొలి మ్యాచ్ గండం పొంచి ఉంది. 2012 నుండి ఇప్పటివరకు ఆ జట్టు సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించలేదు. ఈసారి ఎలాగైనా గెలిచి ఈసెంటిమెంట్‌ను బ్రేక్ చేయాలని ముంబై భావిస్తోంది. బుమ్రా, సూర్యకుమార్, హార్దిక్, రోహిత్ వంటి స్టార్ ఆటగాళ్లతో ముంబై ఇండియన్స్ పటిష్టంగా కన్పిస్తోంది.
చదవండి: పెళ్లిపీటలెక్కనున్న కావ్య మారన్?


