పెళ్లిపీటలెక్కనున్న కావ్య మారన్‌? | SRHs Kavya Maran To Marry CSK Worshipper And Boyfriend Anirudh Ravichander, Rumours Went Viral | Sakshi
Sakshi News home page

పెళ్లిపీటలెక్కనున్న కావ్య మారన్‌?

Mar 28 2026 3:08 PM | Updated on Mar 28 2026 4:05 PM

SRHs Kavya Maran To Marry CSK Worshipper Boyfriend, Anirudh Ravichander: Reports

ఎస్ఆర్‌హెచ్‌ ఓన‌ర్ కావ్య మార‌న్, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ వివాహం చేసుకోబోతున్నారనే వార్త సోష‌ల్ మీడియాలో మ‌రోసారి హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఇదే ఆంశంపై అనిరుధ్ స్పందించిన తీరు ఈ వార్త‌ల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తోంది.

గ‌తేడాది జూన్‌లో కూడా వీరిద్ద‌రూ ప్రేమలో ఉన్న‌ట్లు ప్రచారం జ‌రిగింది. కావ్య-అనిరుధ్ క‌లిసి అమెరికాకు వెళ్లార‌నే వార్తలు కూడా నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే వీటిన్న‌టికి అనిరుధ్ ఒక్క స‌మాధానంతో చెక్ పెట్టాడు.

పెళ్ళా? హాహా.. ప్లీజ్ గాయ్స్, కాస్త కూల్ అవ్వండి. ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయడం ఆపండి" అని ఎక్స్ వేదిక‌గా క్లారిటీ ఇచ్చాడు. అయితే తాజాగా ఓ సినిమా ప్ర‌మోష‌న్‌లో అనిరుధ్ పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా ఓ రిపోర్ట‌ర్ త‌న పెళ్లి గురించి అడ‌గ‌గా.. అందుకు అనిరుధ్  "మళ్లీ ఇదేనా " అని అసహనంతో సమాధానమిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయారు.

ఈ వార్తలను అత‌డు పూర్తిగా ఖండించకపోవడంతో ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌నే అనుమానాలు మ‌రింత బ‌ల‌ప‌డుతున్నాయి. అయితే అటు కావ్య మారన్ నుంచి కానీ, ఇటు అనిరుధ్ కుటుంబం నుంచి కానీ వీరి వివాహం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

కావ్య పాప దృష్టి మొత్తం ఐపీఎల్‌-2026 సీజన్‌పైనే ఉంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. మరోవైపు అనిరుధ్‌ వరుస సినిమాలో బీజీగా ఉన్నాడు.
చదవండి: ఆమెను ఎందుకు రాణిలా ట్రీట్‌ చేస్తున్నారు: చిక్కుల్లో పాక్‌ క్రికెటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement