ఐర్లాండ్‌తో ఇవాళ (మే 27) మొదలైన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 4 పరుగులకే తొలి వికెట్ (టామ్ లాథమ్), 21 పరుగులకే రెండో వికెట్ (డెవాన్ కాన్వే), 85, 86 పరుగులకే మూడు (కేన్ విలియమ్సన్), నాలుగు (డారిల్ మిచెల్) వికెట్లు కోల్పోయినా, మరో వికెట్ పడకండా జాగ్రత్తగా ఆడుతూ 300 పరుగుల మార్కును తాకింది.
రచిన్ రవీంద్ర (121) కెరీర్‌లో ఐదో టెస్ట్ సెంచరీతో కదంతొక్కగా.. వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ (126) ఏడో టెస్ట్ సెంచరీ తర్వాత కూడా ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. రచిన్-బ్లండెల్ ఐదో వికెట్‌కు ఏకంగా 217 పరుగులు జోడించారు. 79 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 306-5గా ఉంది. బ్లండెల్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ (2) క్రీజ్‌లో ఉన్నారు.
ఐర్లాండ్ పేసర్ మార్క్ అదైర్ ఆదిలో న్యూజిలాండ్‌కు భారీ దెబ్బ కొట్టాడు. టామ్ లాథమ్‌ను డకౌట్ చేసి, ఆతర్వాత డెవాన్ కాన్వేను 4 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత డారిల్ మిచెల్‌కు ఒక్క పరుగుకే ఔట్ చేశాడు. కేన్ విలియమ్సన్‌ను (36) లియామ్ మెక్‌కార్తీ.. రచిన్ రవీంద్రను హ్యారీ టెక్టార్ ఔట్ చేశాడు.


