ఐపీఎల్-2026లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లి, వెంకటేశ్ అయ్యర్ విధ్వంసం సృష్టించారు. 156 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో గుజరాత్ పేసర్లకు వీరిద్దరూ చుక్కలు చూపించారు. ఫలితంగా ఆర్సీబీ స్కోర్ కేవలం 3.3 ఓవర్లలోనే (21 బంతుల్లో) 50 పరుగుల మార్క్ దాటింది.
దీంతో ఆర్సీబీ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఐపీఎల్ ఫైనల్ చరిత్రలో అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన జట్టుగా బెంగళూరు నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉంది. ఐపీఎల్-2023 సీజన్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై సీఎస్‌కే 4 ఓవర్లలో 50 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో సీఎస్‌కే రికార్డును ఆర్సీబీ బ్రేక్ చేసింది.
విజేతగా ఆర్సీబీ
ఇక ఈ ఏడాది సీజన్ ఛాంపియన్స్‌గా ఆర్సీబీ నిలిచింది. గుజరాత్ నిర్ధేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలో చేధించి రెండో ఐపీఎల్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. విరాట్ కోహ్లి కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లితో పాటు వెంకటేశ్ అయ్యర్ 32 పరుగులతో రాణించాడు.
చదవండి: వైభవ్‌కు నో ఛాన్స్.. టీ20 ప్రపంచకప్‌లో భారత ఓపెనర్లు వీరే?


