SRH vs LSG Live Score, IPL 2026: ఐపీఎల్-2026లో భాగంగా ఉప్పల్ మైదానం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడతున్నాయి.
లక్నో ఘన విజయం
ఐపీఎల్-2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. ఆదివారం హైదరాబాద్ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో లక్నో విజయం సాధించింది. 157 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. రిషబ్ పంత్(50 బంతుల్లో 9 ఫోర్లు, 68 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించాడు.
అతడితో పాటు కెప్టెన్ ఐడైన్ మార్‌క్రమ్ 45 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో హర్ష్ దూబే రెండు, శివాంగ్ కుమార్, మలింగ తలా వికెట్ సాధించారు.
విజయానికి చేరువలో లక్నో
ఎస్ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో విజయానికి చేరవైంది. 17 ఓవర్లు ముగిసేసరికి లక్నో 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. లక్నో విజయానికి 19 పరుగులు కావాలి. క్రీజులో రిషబ్ పంత్(48), అబ్దుల్ సమద్(16) ఉన్నారు.
లక్నో నాలుగో వికెట్ డౌన్
నికోలస్ పూరన్ రూపంలో లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన పూరన్.. రనౌటయ్యాడు. లక్నో విజయానికి 47 పరుగులు కావాలి.
లక్నో మూడో వికెట్ డౌన్
అయూశ్ బదోని రూపంలో లక్నో మూడో వికెట్లు కోల్పోయింది. 12 పరుగులు చేసిన బదోని.. హర్ష్ దూబే బౌలింగ్‌లో ఔటయ్యాడు.
లక్నో రెండో వికెట్ డౌన్
లక్నో రెండో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన ఐడైన్ మార్‌క్రమ్.. శివాంగ్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి అయూశ్ బదోని వచ్చాడు.
9 ఓవర్లకు లక్నో స్కోరెంతంటే?
9 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్‌క్రమ్(45),రిషబ్ పంత్(16) ఉన్నారు. లక్నో విజయానికి 81 పరుగులు కావాలి.
లక్నో తొలి వికెట్ డౌన్.. మార్ష్ ఔట్
157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన మిచెల్ మార్ష్.. ఎషాన్ మలింగ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు లక్నో స్కోర్: 38/1
3 ఓవర్లకు లక్నో స్కోర్ ఎంతంటే?
3 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో మార్‌క్రమ్(16), మిచెల్ మార్ష్(8) ఉన్నారు.
అదరగొట్టిన క్లాసెన్, నితీశ్..
లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ స్టార్ బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్ 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్లాసెన్(62), నితీశ్ కుమార్ రెడ్డి(56) తమ అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టును ఆదుకున్నారు.
వీరిద్దరూ ఐదో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించగా.. సిద్దార్ద్, దిగ్వేష్ తలా వికెట్ పడగొట్టారు.
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు
ఎస్‌ఆర్‌హెచ్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. అవేష్ ఖాన్ వేసిన 19 ఓవర్‌లో మొదటి బంతికి హెన్రిచ్ క్లాసెన్ ఔట్ కాగా.. తర్వాతి బంతికి హర్ష్ దూబే ఔటయ్యాడు.
ఎస్‌ఆర్‌హెచ్ ఐదో వికెట్ డౌన్
నితీశ్ కుమార్ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. 56 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన నితీశ్ కుమార్ రెడ్డి.. సిద్దార్ధ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
నితీశ్ కుమార్ రెడ్డి ఫిప్టీ
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 30 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను నితీశ్ అందుకున్నాడు.
16 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్: 123/4
16 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ రెడ్డి(49), హెన్రిచ్ క్లాసెన్(50) దూకుడుగా ఆడుతున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 97 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.
దూకుడుగా ఆడుతున్న నితీశ్..
12 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్‌హెచ్ 4 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్(19), నితీశ్ కుమార్ రెడ్డి(23) స్కోర్ వేగాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
నాలుగు వికెట్లు కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్
26 పరుగుల వద్ద లివింగ్ స్టోన్ (16) ఔట్ అయ్యాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ 26పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
పీకల్లోతు కష్టాల్లో ఎస్‌ఆర్‌హెచ్
స్వల్ప వ్యవధిలో వరుస వికెట్లు కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అభిషేక్ శర్మ డకౌట్ కాగా.. ఇషాన్ (1), త్రావిస్ హెడ్(7) పరుగులు చేసి పెవీలియన్‌కు క్యూ కట్టారు. ప్రస్తుతం హెచ్‌ఆర్‌ఎస్ 6 ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసింది
మూడో వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్
మొదటి ఓవర్ పూర్తయ్యాక రాథీని బౌలింగ్ నుంచి తీసేశారు. ఆయన స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్‌పై గత మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌కు వచ్చాడు. తన మంచి ఫామ్‌ను కొనసాగిస్తూ ఇషాన్ కిషన్‌కి బంతిని లోపలికి స్వింగ్ చేసి ఆఫ్ స్టంప్‌ను కూల్చేశాడు. దాంతో ఎస్ఆర్‌హెచ్ స్కోరు 11/3గా పడిపోయింది. ఇప్పుడు ఎస్‌ఆర్‌ఎచ్ లియామ్ లివింగ్‌స్టోన్, హైన్రిచ్ క్లాసెన్‌పై భారం పడింది.
రెండో వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్
- రెండో వికెట్ తీసిన మహ్మద్ షమీ
- 2.1వ బంతికి భారీ షాట్ ఆడిన ట్రావిస్ హెడ్ (7)
- క్యాచ్ అందుకున్న మార్‌క్రమ్
రెండో వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్
- ఎస్‌ఆర్‌హెచ్ తొలి వికెట్ కోల్పోయింది
- మహ్మద్ షమీ వేసిన తొలి ఓవర్ చివరి బంతిని అభిషేక్ ఫ్లిప్ చేశాడు
- బ్యాట్ ఔట్ సైడ్ ఎడ్జ్‌ను తాకి బంతి గాల్లోకి లేచింది.
ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా ప్రారంభమైన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్)తో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి)తో తలపడుతున్నాయి. ఈ టోర్నమెంట్‌లో తమ స్థానాన్ని పదిలపరుచుకోవాలని ఇరు జట్లు కృతనిశ్చయంతో ఉన్నాయి. ఎస్ఆర్‌హెచ్ సొంతగడ్డపై ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తుండగా.. ఎల్‌ఎస్‌జి ఈ సీజన్‌లో తొలి పాయింట్ల కోసం వేటాడుతోంది
సన్‌రైజర్స్ హైదరాబాద్
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్, వికెట్ కీపర్), హైన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్
ఇంపాక్ట్ సబ్స్: ఈషాన్ మలింగ, డేవిడ్ పేన్, సలిల్ అరోరా, శివమ్ మావి, జీషాన్ అంసారీ
లక్నో సూపర్ జెయింట్స్
మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌధరి, అవేశ్ ఖాన్, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాథీ, ఎం. సిద్ధార్థ్
ఇంపాక్ట్ సబ్స్ : అన్రిచ్ నోర్కియా, హిమ్మత్ సింగ్, షాహ్‌బాజ్ అహ్మద్, ఆయుష్ బడోని, మాథ్యూ బ్రిట్జ్‌కే


