ఇషాన్‌ విధ్వంసం.. అనికేత్‌ మెరుపులు.. సన్‌రైజర్స్‌ భారీ స్కోర్‌ | IPL 2026: SRH sets 202 runs target to RCB | Sakshi
Sakshi News home page

ఇషాన్‌ విధ్వంసం.. అనికేత్‌ మెరుపులు.. సన్‌రైజర్స్‌ భారీ స్కోర్‌

Mar 28 2026 9:39 PM | Updated on Mar 28 2026 9:41 PM

IPL 2026: SRH sets 202 runs target to RCB

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్సీబీతో ఇవాళ (మార్చి 28) ఐపీఎల్‌ 2026 ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ స్కోర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌.. ఇషాన్‌ కిషన్‌ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం, అనికేత్‌ వర్మ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపుల కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.

ఆర్సీబీ అరంగేట్రం బౌలర్‌ జేకబ్‌ డఫీ (4-0-22-3) ధాటికి 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సన్‌రైజర్స్‌ను ఇషాన్‌.. హెన్రిచ్‌ క్లాసెన్‌ (22 బంతుల్లో 31; 2 ఫోర్లు, సిక్స్‌) సాయంతో గట్టెక్కించాడు. వరుస విరామాల్లో వికెట్లు పడినా ఆఖర్లో అనికేత్‌ మెరుపు ఇన్నింగ్స్‌ కారణంగా సన్‌రైజర్స్‌ 200 పరుగుల మార్కును దాట గలిగింది. 

మిగతా సన్‌రైజర్స్‌ బ్యాటర్లలో హెడ్‌ 11, అభిషేక్‌ 7, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 1, సలీల్‌ అరోరా 9, హర్ష్‌ దూబే 3, హర్షల్‌ పటేల్‌ డకౌట్‌ కాగా.. డేవిడ్‌ పేన్‌ 6, ఉనద్కత్‌ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో డఫీ, రొమారియో షెపర్డ్‌ చెరో 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్‌ కుమార్‌, అభినందన్‌ సింగ్‌, సుయాశ్‌ శర్మ తలో వికెట్‌ తీశారు.

తుది జట్లు..
ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్‌కీపర్‌), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ

సన్‌రైజర్స్‌: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement