IPL 2026: ఆర్సీబీకి ఓ గుడ్‌ న్యూస్‌, ఓ బ్యాడ్‌ న్యూస్‌ | IPL 2026: One good news and one bad news for RCB, Hazlewood in, Thushara Out | Sakshi
Sakshi News home page

IPL 2026: ఆర్సీబీకి ఓ గుడ్‌ న్యూస్‌, ఓ బ్యాడ్‌ న్యూస్‌

Mar 26 2026 5:00 PM | Updated on Mar 26 2026 5:25 PM

IPL 2026: One good news and one bad news for RCB, Hazlewood in, Thushara Out

ఐపీఎల్‌ 2026 ప్రారంభానికి ముందు ఆర్సీబీకి ఓ గుడ్‌ న్యూస్‌, ఓ బ్యాడ్‌ న్యూస్‌ అందుతుంది. స్టార్‌ పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ సీజన్‌ ప్రారంభానికి ముందే జట్టుతో చేరాడు. హాజిల్‌వుడ్‌ ఈ సీజన్‌ ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని తొలుత ప్రచారం జరిగింది. అయితే అతను సీజన్‌ ప్రారంభానికి ముందే జట్టుతో కలిసి ఆర్సీబీ అభిమానుల్లో జోష్‌ నింపాడు. 

తమ బౌలింగ్‌ యూనిట్‌కు బ్యాక్‌ బోన్‌ అయిన హాజిల్‌వుడ్‌ జట్టులో చేరడంతో ఆర్సీబీ టైటిల్‌ నిలబెట్టుకోగలమన్న ధీమా వ్యక్తం చేస్తుంది. గత ఎడిషన్‌లో ఆర్సీబీ టైటిల్‌ గెలవడంలో హాజిల్‌ కీలకపాత్ర పోషించాడు. అందుకే ఈ సీజన్‌లో అతనిపై భారీ అంచనాలు ఉన్నాయి. గాయాల కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న హాజిల్‌వుడ్‌, ఎట్టకేలకు జట్టులో చేరడంతో ఆర్సీబీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. హాజిల్‌వుడ్‌ను ఆర్సీబీ రూ. 12.5 కోట్లకు రీటైన్‌ చేసుకున్న విషయం తెలిసిందే.

బ్యాడ్‌ న్యూస్‌ ఏంటంటే.. రూ. 1.6 కోట్లకు రీటైన్‌ చేసుకోబడిన నువాన్‌ తుషార (శ్రీలంక) ఈ సీజన్‌ మొత్తానికే దూరమయ్యాడు. ఫిట్‌నెస్‌ కారణాల చేత లంక క్రికెట్‌ బోర్డు అతనికి ఎన్‌ఓసీ మంజూరు చేయలేదు. దీంతో అతను ఐపీఎల్‌ 2026లో పాల్గొనడానికి అనర్హుడయ్యాడు. తుషారపై ఆర్సీబీ భారీ అంచనాలు పెట్టుకొని ఉండింది. డెత్‌ ఓవర్లలో అతని వైవిధ్యం జట్టుకు ఉపయోగపుడుతుందని భావించింది. అయితే చివరి నిమిషంలో ఇలా జరగడంతో ఆర్సీబీ ఫ్యాన్స్‌ హర్ట్‌ అయ్యారు.

తుషార అంశం బయటికి రాక​ ముందే ఆర్సీబీ పేస్‌ బౌలింగ్‌ విభాగానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగత కారణాల చేత లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ యశ్‌ దయాల్‌ సీజన్‌ మొత్తానికే దూరమయ్యాడు.

ఈ సీజన్‌లో ఆర్సీబీ ఆరంభ మ్యాచ్‌తోనే తమ ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. ఢిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో మార్చి 28న జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగనుంది. 

ఈ సీజన్‌లోనూ ఆర్సీబీ రజత్‌ పాటిదార్‌ నేతృత్వంలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గత సీజన్‌తో పోలిస్తే, ఆర్సీబీలో పెద్ద మార్పులు జరగలేదు. విరాట్‌ కోహ్లి, టిమ్‌ డేవిడ్‌, జేకబ్‌ బేతెల్‌, కృనాల్‌ పాండ్యా, దేవ్‌దత్‌ పడిక్కల్‌, ఫిల్‌ సాల్ట్‌, రొమారియో షెపర్డ్‌, జితేశ్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, హాజిల్‌వుడ్‌, సుయాశ్‌ శర్మ తదితర ఆటగాళ్లు జట్టులో కొనసాగుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement