IPL 2026: రాజస్థాన్‌-సీఎస్‌కే మ్యాచ్‌ జరిగేనా..? గౌహతిలో వర్షం​ | IPL 2026 Match Rajasthan Royals vs Chennai Super Kings: Rain Threat Looms Large | Sakshi
Sakshi News home page

IPL 2026: రాజస్థాన్‌-సీఎస్‌కే మ్యాచ్‌ జరిగేనా..? గౌహతిలో వర్షం​

Mar 30 2026 6:17 PM | Updated on Mar 30 2026 6:27 PM

IPL 2026 Match Rajasthan Royals vs Chennai Super Kings: Rain Threat Looms Large

ఐపీఎల్‌ 2026లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య ఇవాల్టి (మార్చి 30) మ్యాచ్‌ జరగాల్సి ఉంది. గౌహతిలోని బర్సపరా వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్‌ జరుగుతుందా లేదా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

ఎందుకంటే, మ్యాచ్‌ ప్రారంభానికి ముందు గౌహతిలో వర్షం మొదలైంది. పిచ్‌ను, కొంత భాగం మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఈ విషయం సోషల్‌మీడియాలో వైరలవడంతో, నేటి మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. వాతావరణ సమాచారం ప్రకారం, మ్యాచ్‌ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం 20 శాతంగా ఉంది. ఇప్పటికే వర్షం మొదలైన నేపథ్యంలో టాస్‌ కూడా ఆలస్యమవ్వవచ్చు. 

కాగా, రాజస్థాన్‌ రాయల్స్‌ తమ మూడు హోం మ్యాచ్‌లను గౌహతిలో ఆడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ రద్దైతే ఇరు జట్ల ప్లే ఆఫ్స్‌ అవకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది. కానీ, పరిస్థితి అంత వరకు వెళ్లకపోవచ్చని అంచనా. మ్యాచ్‌ సమయానికి వాతావరణం కుదురుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. హీన పక్షంలో కొన్ని ఓవర్ల మ్యాచ్‌ అయినా జరుగుతుందని అనుకుంటున్నారు. మ్యాచ్‌ ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాకూడదని ఇరు ఫ్రాంచైజీల అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement