155 పరుగులకే ఆలౌటైన ఆర్సీబీ | IPL 2026, Match 42: Gujarat Titans vs RCB Updates and Highlights | Sakshi
Sakshi News home page

155 పరుగులకే ఆలౌటైన ఆర్సీబీ

Apr 30 2026 7:05 PM | Updated on Apr 30 2026 9:22 PM

IPL 2026, Match 42: Gujarat Titans vs RCB Updates and Highlights

155 పరుగులకే ఆలౌటైన ఆర్సీబీ
ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా చెలరేగిపోయారు. హోల్డర్‌ 3, సాయి సుదర్శన్‌, రషీద్‌ ఖాన్‌ తలో 2 క్యాచ్‌లతో ఆర్సీబీని దెబ్బకొట్టారు. బౌలింగ్‌లో అర్షద్‌ ఖాన్‌ 3, హోల్డర్‌, రషీద్‌ ఖాన్‌ తలో 2, సిరాజ్‌, రబాడ చెరో వికెట్‌ పడగొట్టారు. ఫలితంగా ఆర్సీబీ 155 పరుగులకే ఆలౌటైంది.

ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పడిక్కల్‌ (40) టాప్‌ స్కోరర్‌ కాగా.. విరాట్‌ 28, బేతెల్‌ 5, పాటిదార్‌ 19, జితేశ్‌ శర్మ 1, టిమ్‌ డేవిడ్‌ 9, కృనాల్‌ 4, షెపర్డ్‌ 17, వెంకటేశ్‌ అయ్యర్‌ 12, భువనేశ్వర్‌ కుమార్‌ 15 (నాటౌట్‌), హాజిల్‌వుడ్‌ డకౌటయ్యారు. 

ఏడో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
13.6వ ఓవర్‌- 126 పరుగుల వద్ద ఆర్సీబీ ఏడో వికెట్‌ కోల్పోయింది.రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో పడిక్కల్‌ (40) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
8.1వ ఓవర్‌- 80 పరుగుల వద్ద ఆర్సీబీ నాలుగో వికెట్‌ కోల్పోయింది. హోల్డర్‌ బౌలింగ్‌లో జితేశ్‌ శర్మ (1) అతనికే క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.  

హోల్డర్‌ సూపర్‌ క్యాచ్‌
7.4వ ఓవర్‌- 79 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్‌ కోల్పోయింది. అర్షద్‌ ఖాన్‌ బౌలింగ్లో జేసన్‌ హోల్డర్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో రజత్‌ పాటిదార్‌ (19) ఔటయ్యాడు. 

కోహ్లి ఔట్‌
3.2వ ఓవర్‌- 35 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్‌ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి విరాట్‌ కోహ్లి (28) ఔటయ్యాడు. 

తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ
2.4వ ఓవర్‌- 34 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి జేకబ్‌ బేతెల్‌ (5) ఔటయ్యాడు.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌
ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 30) జరుగనున్న 42 మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, ఆర్సీబీ తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. 

కాగా, పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆర్సీబీ రెండో స్థానంలో ఉండగా.. గుజరాత్‌ ఐదో స్థానంలో ఉంది. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించగా.. గుజరాత్‌ 8లో నాలుగు విజయాలు నమోదు చేసింది. 

తుది జట్లు..

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(సి), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(w), జాసన్ హోల్డర్, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, మానవ్ సుతార్ 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్

Advertisement
 
Advertisement
Advertisement