మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్
13.6వ ఓవర్- 144 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. రాజ్ పుంజా బౌలింగ్‌లో రియాన్ పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి ప్రభ్‌సిమ్రన్ (59) ఔటయ్యాడు.
రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్
8.2వ ఓవర్- 96 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. యశ్ పుంజా బౌలింగ్‌లో ఫెరియెరాకు క్యాచ్ ఇచ్చి కూపర్ కన్నోల్లీ (30) ఔటయ్యాడు.
7 ఓవర్ల తర్వాత 80-1
7 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 80-1గా ఉంది. ప్రభ్‌సిమ్రన్ 27, కూపర్ కన్నోల్లీ 19 పరుగులతో అజేయంగా ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్
2.5వ ఓవర్- క్రీజ్‌లో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించిన ప్రియాంశ్ ఆర్మ (29) ఆర్చర్ బౌలింగ్‌లో బర్గర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 28) జరుగనున్న 40వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. పంజాబ్ హోం గ్రౌండ్ అయిన ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ప్రస్తుత ఎడిషన్‌లో ఏకైక అజేయ జట్టుగా కొనసాగుతున్న పంజాబ్ (7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, వర్షం కారణంగా ఓ మ్యాచ్ రద్దు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రాజస్థాన్ 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో నాలుగో స్థానంలో ఉంది.
ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ రెండు మార్పులు చేసింది. హెట్‌మైర్ స్థానంలో షనక, రవి బిష్ణోయ్ స్థానంలో యశ్ రాజ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు పంజాబ్ కూడా ఈ మ్యాచ్ కోసం రెండు మార్పులు చేసింది. సూర్యంశ్ షెడ్గే, లోకీ ఫెర్గూసన్ తుది జట్టులోకి వచ్చారు.
తుది జట్లు..
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, దసున్ షనక, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (w), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (సి), కూపర్ కొన్నోలీ, సూర్యాంశ్ షెడ్జ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, లోకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్


