సీఎస్‌కేపై రాయల్స్‌ ఘన విజయం | IPL 2026, Match 3: Rajasthan Royals vs Chennai Super Kings Live Updates | Sakshi
Sakshi News home page

సీఎస్‌కేపై రాయల్స్‌ ఘన విజయం

Mar 30 2026 7:08 PM | Updated on Mar 30 2026 10:41 PM

IPL 2026, Match 3: Rajasthan Royals vs Chennai Super Kings Live Updates

సీఎస్‌కేపై రాయల్స్‌ ఘన విజయం
ఐపీఎల్‌ 2026లో భాగంగా సీఎస్‌కేతో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే, రాయల్స్‌ బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలగా.. రాయల్స్‌ 12.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది.

రెండో వికెట్‌ కోల్పోయిన రాయల్స్‌.. జురెల్‌ ఔట్‌
8.3వ ఓవర్‌- 99 పరుగుల వద్ద రాయల్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. అన్షుల్‌ కంబోజ్‌ బౌలింగ్‌లో ధృవ్‌ జురెల్‌ (18) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

వైభవ్‌ ఔట్‌
17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసిన అనంతరం వైభవ్‌ సూర్యవంశీ ఔటయ్యాడు. అన్షుల్‌ కంబోజ్‌ బౌలింగ్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు.

127 పరుగులకు సీఎస్‌కే ఆలౌట్‌
సీఎస్‌కే ఇన్నింగ్స్‌ 127 పరుగుల వద్ద ముగిసింది. ఓవర్టన్‌ (43) అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించడంతో సీఎస్‌కే 100 పరుగుల మార్కును దాటగలిగింది. ఓవర్టన్‌కు (7 నాటౌట్‌) అన్షుల్‌ కంబోజ్‌ సహకరించాడు. 

రాయల్స్‌ బౌలర్లలో ఆ‍ర్చర్‌, బర్గర్‌, రవీంద్ర జడేజా తలో 2.. బ్రిజేష్‌ శర్మ, సందీప్‌ శర్మ, రవి బిష్ణోయ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో ఓవర్టన్‌తో పాటు కార్తీక్‌ శర్మ (18, సర్ఫరాజ్‌ ఖాన్‌ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 

ఎనిమిదో వికెట్‌ డౌన్‌
12.5వ ఓవర్‌- 82 పరుగుల వద్ద సీఎస్‌కే ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో జురెల్‌కు క్యాచ్‌ ఇచ్చి నూర్‌ అహ్మద్‌ (1) ఔటయ్యాడు.

ఏడో వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే
బ్రిజేశ్‌ శర్మ బౌలింగ్‌లో కార్తిక్‌ శర్మ (18) ఎల్బీడబ్ల్యూ. బ్రిజేశ్‌ ఖాతాలో తొలి ఐపీఎల్‌ వికెట్‌. స్కోరు: 74-7(11). ఓవర్టన్‌ తొమ్మిది పరుగులతో ఉండగా.. నూర్‌ అహ్మద్‌ క్రీజులోకి వచ్చాడు.

ఆరో వికెట్‌ డౌన్‌
జడేజా బౌలింగ్‌లో శివం దూబే రవి బిష్ణోయికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం ఆరు పరుగులు చేసి నిష్క్రమించాడు. స్కోరు: 57-6 (8). కార్తిక్‌ శర్మ 14 పరుగులతో ఉండగా.. జేమీ ఓవర్టన్‌ క్రీజులోకి వచ్చాడు.

సగం వికెట్లు కోల్పోయిన సీఎస్‌కే
రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. 12 బంతుల్లో 17 పరుగులతో ఆడుతున్న సర్ఫరాజ్‌ను జడ్డూ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. శివం దూబే క్రీజులోకి రాగా.. కార్తిక్‌ శర్మ 11 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 57-5(7.5).

కుప్పకూలిన సీఎస్‌కే టాపార్డర్‌
రాజస్థాన్‌ పేసర్ల ధాటికి సీఎస్‌కే టాపార్డర్‌ పేకమేడలా కుప్పకూలింది. బర్గర్‌.. సంజూ శాంసన్‌ (6), మాత్రే (0)ను ఔట్‌ చేయగా.. ఆర్చర్‌ రుతురాజ్‌ను (6), సందీప్‌ శర్మ షార్ట్‌ను (2) పెవిలియన్‌కు పంపారు. 6 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్‌ 41-4గా ఉంది. కార్తీక్‌ శర్మ (3), సర్ఫరాజ్‌ ఖాన్‌ (15) క్రీజ్‌లో ఉన్నారు. 

పీకల్లోతు కష్టాల్లో సీఎస్‌కే
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న సీఎస్‌కే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 19 పరుగులకే 3 వికెట్లు (3.1 ఓవర్లలో) కోల్పోయింది. ఆర్చర్‌, బర్గర్‌ వరుస బంతుల్లో రుతురాజ్‌ (6), ఆయుశ్‌ మాత్రేను (0) ఔట్‌ చేశారు. 

సంజూ క్లీన్‌ బౌల్డ్‌
1.6వ ఓవర్‌- నండ్రే బర్గర్‌ బౌలింగ్‌లో సంజూ శాంసన్‌ (6) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 30) రాజస్థాన్‌ రాయల్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉంది. గౌహతిలోని బర్సపరా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. టాస్‌కు ముందు వర్షం​ పడటంతో 5 నిమిషాలు ఆలస్యమైంది. మ్యాచ్‌ సమయంలో కూడా వరుణుడి ఆటంకాలు తప్పకపోవచ్చు. ప్రస్తుతానికి వాతావరణం​ క్లియర్‌గా ఉంది.

తుది జట్లు..

సీఎస్‌కే: సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్(సి), ఆయుష్ మ్హత్రే, మాథ్యూ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ(w), జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్

ఇంపాక్ట్‌ ప్లేయర్స్‌ ఆప్షన్స్‌: సర్ఫరాజ్‌ ఖాన్‌, ప్రశాంత్‌ వీర్‌, రాహుల్‌ చాహర్‌, గుర్జప్నీత్‌ సింగ్‌, రామకృష్ణ ఘోష్‌

రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(సి), ధృవ్ జురెల్(w), షిమ్రాన్ హెట్మెయర్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ

ఇంపాక్ట్‌ ప్లేయర్స్‌ ఆప్షన్స్‌: డొనొవన్‌ ఫెరియెరా, లుహాన్‌ డ్రి ప్రిటోరియస్‌, సుషాంత్‌ మిశ్రా, రవి  సింగ్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement