KKR vs LSG Live updates: ఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి.
7 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 65/1
7 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజులో రఘువంశీ(26), అజింక్య రహానే(27) ఉన్నారు.
కేకేఆర్ తొలి వికెట్ డౌన్
కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన ఫిన్ అలెన్.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రఘువంశీ వచ్చాడు. 2 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 16/1
ఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌కు దూరమైన కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ తిరిగి జట్టులోకి వచ్చాడు.
దీంతో బ్లెస్సింగ్ ముజర్‌బానీ బెంచ్‌కే పరిమితయమ్యాడు. అయితే స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మాత్రం తన చేతి వేలి గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. మరోవైపు లక్నో తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఎస్‌ఆర్‌హెచ్‌తో ఆడిన టీమ్‌నే కొనసాగించింది.
జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రింకు సింగ్, రోవ్‌మన్ పావెల్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, నవదీప్ సైనీ, కార్తీక్ త్యాగి
ఇంపాక్ట్ సబ్‌లు - మనీష్ పాండే, వైభవ్ అరోరా, తేజస్వి దహియా, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫెర్ట్
లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(కెప్టెన్), నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మణిమారన్ సిద్ధార్థ్, అవేష్ ఖాన్, మహమ్మద్ షమీ, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్
ఇంపాక్ట్ సబ్‌లు - ఆయుష్ బడోని, మాథ్యూ బ్రీట్జ్కే, షాబాజ్ అహ్మద్, మయాంక్ యాదవ్,


