పాపం.. వణికిపోయిన ఇషాన్‌ కిషన్‌! | IPL 2026 RCB Vs SRH, Ishan Kishan Looks Panic About 1st Time Captaincy For SRH And Missing Few Catches, Check Details Inside | Sakshi
Sakshi News home page

IPL 2026 RCB Vs SRH: పాపం.. వణికిపోయిన ఇషాన్‌ కిషన్‌!

Mar 29 2026 9:30 AM | Updated on Mar 29 2026 11:49 AM

IPL 2026: Ishan Kishan Looks Panic About 1st Time Captaincy For SRH

ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌కి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న ఇషాన్ కిష మ్యాచ్‌ ఆద్యంతం కాస్త ఒత్తిడికి లోనైనట్లుగా అనిపించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌తో తొలి మ్యాచ్‌ ఆడాల్సి రావడం, కమిన్స్‌ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడంతో భయంతో కనిపించాడు. బ్యాటింగ్‌లో బాధ్యతగానే జట్టును ముందుకు తీసుకెళ్లినప్పటికీ ఫీల్డింగ్ సమయంలో మాత్రం టెన్షన్‌తో కీపింగ్‌ కూడా సరిగా చేయలేకపోయాడు.

ఆర్సీబీ బ్యాటింగ్ దూకుడుతో ఒకవైపు బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటుంటే.. మరోవైపు ఇషాన్ కిషన్ వికెట్ల వెనుక బంతులు వదిలేసి బౌండరీలు అందించాడు. ఈజీగా వచ్చిన బంతుల్ని కూడా పట్టుకోలేక గ్లౌజుల కింద నుంచి ఫోర్లు ఇచ్చేశాడు. ఇషాన్ కిషన్ దగ్గర రెండు బంతులు మిస్సవగా.. రెండు కూడా గ్లౌజుల కింద నుంచే వెళ్లిపోయాయి.

బౌలర్లను సమన్వయం చేసుకోవడంలో కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ విఫలమయ్యాడు. రెండో ఓవర్‌లోనే ఫిల్ సాల్ట్ వికెట్ పడినప్పటికీ.. పవర్ ప్లేలో మరో వికెట్ తీయలేకపోయాడు. ఆర్సీబీ స్టార్స్ దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోయాడు. 

జయదేవ్ ఉనద్కత్, నితీష్ కుమార్ రెడ్డి 10లోపు పరుగులు సమర్పించగా.. మిగతా బౌలర్లంతా 11, 14 పరుగులు ఇచ్చారు. ఈషాన్ మలింగ ఏకంగా 2 ఓవర్లలో 35 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌పై విన్ని అందుకుంది.

మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. ‘మొదటి 3-4 ఓవర్ల తర్వాత వికెట్ ఖచ్చితంగా బాగా సహకరించిందని నేను భావిస్తున్నాను. మేము ఆరంభంలోనే కొన్ని వికెట్లు కోల్పోయాము, వచ్చేసారి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. 

ఎందుకంటే, రెండో ఇన్నింగ్స్ వికెట్ను చూస్తే, బ్యాటింగ్ చేయడానికి చాలా సులభంగా ఉంది. బంతి బ్యాట్‌పైకి చాలా చక్కగా వస్తోంది. కాబట్టి అవును, వచ్చేసారి మేము షాట్ ఎంపికలో మరింత వివేకంతో వ్యవహరించాలి’ అని చెప్పుకొచ్చాడు.

Advertisement
 
Advertisement
Advertisement