PC: BCCI/IPL
ఐపీఎల్-2026లో అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్లు శబ్‌మన్ గిల్, సాయిసుదర్శన్ తీవ్ర నిరాశపరిచారు. క్వాలిఫయర్-2లో మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ.. తుది పోరులో మాత్రం పూర్తిగా తేలిపోయింది.
గుజరాత్ ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేసిన జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో రెండో బంతిని గిల్ షార్ట్-ఆర్మ్ జాబ్ ఫుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని మిడ్-ఆఫ్ దిశగా గాల్లోకి లేచింది. ఈ క్రమంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తన కుడివైపునకు పరిగెత్తుకు వచ్చి బంతిని అందుకున్నాడు.
దీంతో గిల్ 8 బంతుల్లో 10 పరుగులు చేసి తీవ్ర నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ ఓవర్‌లో సాయిసుదర్శన్(12 బంతుల్లో 12) కూడా ఓ చెత్త షాట్ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. దీంతో గుజరాత్ 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి గుజరాత్ కష్టాల్లో పడింది. ఇక ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో (732), సుదర్శన్(722) రెండు, మూడు స్ధానాల్లో నిలిచారు.
చదవండి: IND vs SL: రుతురాజ్ గైక్వాడ్‌కు బంపర్ ఆఫర్


