
సరిపోని దూబే మెరుపులు.. రాజస్తాన్ ఘన విజయం
ఐపీఎల్ 16వ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ రెండు ఓటముల తర్వాత మళ్లీ విజయాల బాట పట్టింది. గురువారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. 203 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. శివమ్ దూబే 33 బంతుల్లో 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రుతురాజ్ గైక్వాడ్ 47 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు తీయగా.. అశ్విన్ రెండు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశాడు.
మొయిన్ అలీ(23)ఔట్.. ఐదో వికెట్ డౌన్
23 పరుగులు చేసిన మొయిన్ అలీ ఆడమ్ జంపా బౌలింగ్‌లో శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో సీఎస్‌కే 124 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. సీఎస్‌కే విజయానికి 30 బంతుల్లో 78 పరుగులు కావాలి.
సీఎస్‌కేను దెబ్బతీసిన అశ్విన్.. రాయుడు గోల్డెన్ డక్
రాజస్తాన్ స్పిన్నర్ అశ్విన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి సీఎస్‌కేను దెబ్బకొట్టాడు. తొలుత రహానేను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చిన అశ్విన్.. ఆ తర్వాత రాయుడు గోల్డెన్ డకౌట్ చేశాడు. దీంతో సీఎస్‌కే 73 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
రుతురాజ్(47)ఔట్ .. రెండో వికెట్ డౌన్
నిలకడగా ఆడుతున్న రుతురాజ్(47) అనవసర షాట్‌కు యత్నించి జంపా బౌలింగ్‌లో పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో సీఎస్‌కే 69 పరుగుల వద్ద రెండో వికెట్ నష్టపోయింది. రహానే 14 పరుగులతో ఆడుతున్నాడు.
టార్గెట్ 203.. తొలి వికెట్ కోల్పోయిన సీఎస్‌కే
203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే తొలి వికెట్ కోల్పోయిది. 8 పరుగులు చేసిన డెవన్ కాన్వే ఆడమ్ జంపా బౌలింగ్‌లో సందీప్‌శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్‌కే ఏడు ఓవర్లలో వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. రుతురాజ్ 40 పరుగులతో ఆడుతున్నాడు.
Photo Credit : IPL Website
జైపూర్‌లో రాజస్తాన్ అత్యధిక స్కోరు.. సీఎస్‌కే టార్గెట్ 203
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా సీఎస్‌కేతో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. జైపూర్‌లో రాజస్తాన్‌కు ఇదే అత్యధిక స్కోరు. ఇక రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్ 43 బంతుల్లో 77 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. చివర్లో ద్రువ్ జురేల్ 15 బంతుల్లో 34, దేవదత్ పడిక్కల్ 13 బంతుల్లో 23 పరుగులు నాటౌట్ చెలరేగడంతో రాజస్తాన్ 200 మార్క్‌ను అందుకుంది. సీఎస్‌కే బౌలర్లలో తుషార్ దేశ్ పాండే రెండు వికెట్లు తీయగా.. పతీరానా, రవీంద్ర జడేజాలు చెరొక వికెట్ తీశారు.
Photo Credit : IPL Website
జైశ్వాల్(77) ఔట్.. 14 ఓవర్లలో రాజస్తాన్ 132/3
77 పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్ తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ 14 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.
Photo Credit : IPL Website
12 ఓవర్లలో రాజస్తాన్ 113/1
12 ఓవర్లలో రాజస్తాన్ వికెట్ నష్టపోయి 113 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్ 66, శాంసన్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Photo Credit : IPL Website
తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్.. బట్లర్(27) ఔట్
సీఎస్‌కేతో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన జాస్ బట్లర్ జడేజా బౌలింగ్‌లో దూబేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది.
Photo Credit : IPL Website
6 ఓవర్లలో రాజస్తాన్ 64/0
సీఎస్‌కేతో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌ను దాటిగా ఆరంభించింది. ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్ 21 బంతుల్లో 40 పరుగులు, జాస్ బట్లర్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Photo Credit : IPL Website
దంచి కొడుతున్న రాజస్తాన్.. 3 ఓవర్లలో 42/0
సీఎస్‌కేతో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌ను దాటిగా ఆరంభించింది. మూడు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్ 11 బంతుల్లోనే 31 పరుగులు, జాస్ బట్లర్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Photo Credit : IPL Website
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్
ఐపీఎల్ 16వ సీజన్‌లో గురువారం జైపూర్ వేదికగా 37వ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, సీఎస్‌కే తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్/కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్/కెప్టెన్), మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, ఆకాశ్ సింగ్
Huge roar for MS Dhoni in Jaipur. pic.twitter.com/jzWxFVINl4
— Johns. (@CricCrazyJohns) April 27, 2023
వరుస విజయాలతో సీఎస్‌కే దుమ్మురేపుతుండగా.. మరోవైపు రాజస్తాన్‌మాత్రం రెండు వరుస పరాజయాలతో కాస్త డీలా పడింది. సీఎస్‌కేపై గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని రాజస్తాన్ ఉవ్విళ్లూరుతుంది.