IPL 2021 Phase 2: ఆకాష్‌ చోప్రా ఆర్సీబీ జట్టు ఇదే!

IPL 2021 2nd Phase: Aakash Chopra Predicts RCB Playing XI - Sakshi

Aakash Chopra Predicts RCB's Playing XI: విరాట్‌ కోహ్లి సారథ్యంలోని  ఆర్సీబీ జట్టు  ఐపీఎల్‌ సె​కెండ్‌ ఫేజ్‌లో భాగంగా సెప్టెంబర్‌ 20న తన తొలి మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో తలపడనుంది. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు ఆకాష్‌ చోప్రా.. ఐపీఎల్‌ రెండో దశలో పాల్గోనే ఆర్సీబీ జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. ఓపెనర్లుగా కెప్టెన్ విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్‌ని ఎంచుకున్నాడు.

మరో వైపు మధ్యప్రదేశ్ యువ క్రికెటర్ రజత్ పాటీదార్‌ను ‍కూడా ఆర్సీబీ ఓపెనర్‌గా  అవకాశం ఇవ్వవచ్చని అతడు తెలిపాడు. అయితే, టోర్నమెంట్ ప్రారంభంలో జట్టు మార్పులు చేయడం మానుకోవాలని కోహ్లీ బృందానికి అతడు ఈ సందర్భంగా సూచించాడు. కాగా గ్లెన్ మాక్స్‌వెల్,  ఏబీ డివిలియర్స్‌కు ఆర్సీబీ మిడిల్ ఆర్డర్‌లో ఆకాశ్‌ చోప్రా అవకాశం ఇచ్చాడు.

ఆల్ రౌండర్ కోటాలో షాబాజ్ అహ్మద్, న్యూజిలాండ్ ఆటగాడు కైల్ జమీసన్‌కు ఆరు, ఏడు స్ధానాల్లో చోటు ఇచ్చాడు. ఆకాష్‌ చోప్రా ఎంచుకున్న జట్టు బౌలింగ్‌ విభాగంలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్, హర్షల్‌ పటేల్‌, శ్రీలంక ఫాస్ట్‌ బౌలర్‌ దుశ్మంత చమీరా, లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ ఉన్నారు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌తో ఐపీఎల్‌ రెండో దశ ప్రారంభం కానుంది.

ఆకాష్‌ చోప్రా ఆర్సీబీ జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌ ఇదే: దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి (c), రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, డివిలియర్స్ (wk), షాబాజ్ అహ్మద్, కైల్ జమీసన్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, హర్షల్‌పటేల్‌, దుష్మంత చమీరా

చదవండి: IPL 2021 2nd Phase Schedule: ఐపీఎల్‌ 2021 రెండో ఫేజ్‌ షెడ్యూల్‌ ఇలా.. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top