భారత్‌ X దక్షిణాఫ్రికా | Indian womens cricket team will play a five match T20 series against South Africa | Sakshi
Sakshi News home page

భారత్‌ X దక్షిణాఫ్రికా

Apr 17 2026 3:59 AM | Updated on Apr 17 2026 3:59 AM

Indian womens cricket team will play a five match T20 series against South Africa

టి20 ప్రపంచ కప్‌కు ముందు సన్నాహకాల్లో భాగంగా భారత మహిళల క్రికెట్‌ జట్టు నేటి నుంచి దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ఆడనుంది. ఇంగ్లండ్‌ వేదికగా ఈ ఏడాది జూన్‌లో ప్రపంచ కప్‌ జరగనున్న నేపథ్యంలో ఒక అగ్రశ్రేణి టీమ్‌తో సిరీస్‌ టీమిండియాకు ఉపయోగపడనుంది. ఇటీవల ఆస్ట్రేలియా, శ్రీలంకపై టి20 సిరీస్‌లు గెలిచిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని టీమిండియా... సఫారీతో సిరీస్‌ ద్వారా జట్టు కూర్పును సరిచూసుకోవాలని భావిస్తోంది. 

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మతో భారత జట్టు బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో ఆంధ్ర అమ్మాయిలు అరుంధతి రెడ్డి, శ్రీచరణి కీలకం కానున్నారు. ‘వరల్డ్‌కప్‌నకు ముందు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నాం. వన్డే ప్రపంచకప్‌ సాధించిన అనంతరం జట్టులో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది’ అని హర్మన్‌ వెల్లడించింది.  రాత్రి గం.9:30 నుంచి జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement