
బ్యాంకాక్: ఆసియా అండర్–22 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను భారత్ స్వర్ణ పతకంతో ముగించింది. చివరిరోజు సోమవారం భారత్‌కు ఒక స్వర్ణం, నాలుగు రజతాలు లభించాయి. మహిళల ప్లస్ 80 కేజీల విభాగంలో రితిక భారత్‌కు పసిడి పతకాన్ని అందించింది.
ఫైనల్లో రితిక 4:1తో అసెల్ తొక్తాసియన్ (కజకిస్తాన్)పై గెలిచింది. ఫైనల్స్‌లో ఓడిన యాత్రి పటేల్ (57 కేజీలు), ప్రియ (60 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. పురుషుల విభాగంలో నీరజ్ (75 కేజీలు), ఇషాన్ కటారియా (ప్లస్ 90 కేజీలు) కూడా రజత పతకాలు సాధించారు. ఫైనల్స్‌లో బొల్తాయెవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో నీరజ్... ఖాలిమ్‌జన్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఇషాన్ ఓడిపోయారు.