టీమిండియా పింక్‌ బాల్‌ టెస్టు: ఆ ఇద్దరికీ షాక్‌!

India Have Announced Their XI For The First Test - Sakshi

న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆస్ట్రేలియా-భారత్‌ తొలి టెస్టుకు మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. డే అండ్‌ టెస్టు కావడం, పింక్‌ బాల్‌తో ఆట జరుగనుండటంతో ఈ మ్యాచ్‌పై మరింత ఆసక్తి నెలకొంది. అడిలైడ్‌ ఓవల్‌లో డిసెంబర్‌ 17న మొదలు కానున్న ఈ మ్యాచ్‌కు సంబంధించి బీసీసీఐ బుధవారం తన జట్టు సభ్యులను ప్రకటించింది. ఇక ఈ మ్యాచ్‌లో వృద్ధిమాన్‌ సాహా, పృథ్వీ షా చోటు దక్కించుకోగా.. వార్మప్‌ మ్యాచ్‌ల్లో రాణించిన రిషభ్‌ పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌ అనూహ్యంగా బెంచ్‌కే పరిమితమయ్యారు.

పింక్‌బాల్‌తో డే అండ్‌ నైట్‌లో జరిగిన  రెండో వార్మప్‌ మ్యాచ్‌లో గిల్‌ 43, 65 పరుగులతో ఫరవాలేదనిపించాడు.అతని స్థానంలో పృథ్వీ షాను ఎంపిక చేయడంపై కొందరు క్రికెట్‌ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వార్మప్‌ మ్యాచుల్లోని నాలుగు ఇన్నింగ్స్‌లలో షా 0, 19, 40, 3 పరుగులు మాత్రమే చేశాడు. ఇక స్పిన్నర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌కు అవకాశం కల్పించారు. ఆల్‌రౌండర్లు కుల్దీప్‌ యాదవ్‌​, రవీంద్ర జడేజా చోటు దక్కించుకోగా.. బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి మిడిల్‌ ఓవర్లలో బౌలర్‌గానూ సేవలు అందించనున్నాడు. ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమీ, జస్ప్రీత్‌ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌‌ టీమిండియా బౌలింగ్‌ దళం పటిష్టంగా ఉంది.
(చదవండి: ఒక్క మ్యాచ్‌.. రెండు రికార్డులు కొట్టే అవకాశం)

ఆ ఇద్దరూ ఓపెనర్లుగా..
చతేశ్వర్‌ పుజారాతో కలిసి పృథ్వీ షా ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశాలున్నాయి. ఇక రిషబ్‌ పంత్‌ స్థానంలో జట్టులోకొచ్చిన వృద్ధిమాన్‌ సాహా వికెట్‌ కీపర్‌ బాధ్యతలు నిర్వర్తిసాడు. కాగా, ఈ మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి భారత్‌కు తిరుగుపయనమవుతాడు. అతని భార్య అనుష్క శర్మ డెలివరీ నేపథ్యలో మిగతా టెస్టు మ్యాచ్‌లకు కోహ్లి అందుబాటులో ఉండటం లేదు. అజింక్యా రహానే కెప్టెన్‌గా వ్యవరిస్తాడు. మరోవైపు వ్యక్తిగత కారణాలతో ఆసీస్‌ పర్యటకు వెళ్లలేకపోయిన రోహిత్‌, ఇటీవలే ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తి చేసుకుని ఆటకు సిద్ధమయ్యాడు. డిసెంబర్‌ 15న ఆస్ట్రేలియాకు పయనమయ్యాడు. చివరి రెండు టెస్టులకు అతను అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

టీమిండియా తుది జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, చతేశ్వర్ పూజారా, అజింక్య రహానె, హనుమా విహారీ, వృద్ధిమాన్ సాహా (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.
(చదవండి: వైరల్‌ : ఒకరినొకరు తోసుకున్న టీమిండియా ఆటగాళ్లు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top