అవసరం లేదు! సంజూ శాంసన్‌ను స్వదేశానికి పంపిన బీసీసీఐ | Ind Vs Pak: Sanju Samson Sent Home After KL Rahul Joins Squad - Report | Sakshi
Sakshi News home page

Ind Vs Pak: అవసరం లేదు! సంజూ శాంసన్‌ను స్వదేశానికి పంపిన బీసీసీఐ

Sep 9 2023 12:49 PM | Updated on Sep 9 2023 1:39 PM

Ind Vs Pak: Sanju Samson Sent Home After KL Rahul Joins Squad - Report - Sakshi

Asia Cup 2023- India vs Pakistan: ఆసియా కప్‌-2023 టోర్నీకి ప్రకటించిన జట్టులో కేరళ బ్యాటర్‌ సంజూ శాంసన్‌కు ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా స్థానం దక్కింది. సీనియర్‌ వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ ఫిట్‌నెస్‌ సమస్యల దృష్ట్యా ప్రధాన జట్టులో ఇషాన్‌ కిషన్‌కు చోటిచ్చిన మేనేజ్‌మెంట్‌.. సంజూను బ్యాకప్‌గా ఎంపిక చేసింది.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఇషాన్‌
ఈ నేపథ్యంలో తనకు వచ్చిన అవకాశాన్ని జార్ఖండ్‌ బ్యాటర్‌ ఇషాన్‌ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఈవెంట్‌తో తమ ఆరంభ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడ్డ టీమిండియా గౌరవప్రదమైన స్కోరు చేయడంలో ఈ వికెట్‌ కీపర్‌ కీలక పాత్ర పోషించాడు.

వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(87)తో కలిసి అద్భుత ఇన్నింగ్స్‌(82)తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైపోగా.. నేపాల్‌తో మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్‌ శర్మ(74 నాటౌట్‌), శుబ్‌మన్‌ గిల్‌(67 నాటౌట్‌) లక్ష్యాన్ని పూర్తి చేయడంతో ఇషాన్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు.

కేఎల్‌ రాహుల్‌ వచ్చేశాడు.. తుదిజట్టులో కూడా
ఇదిలా ఉంటే.. సూపర్‌-4లో భాగంగా పాకిస్తాన్‌తో ఆదివారం టీమిండియా తలపడనున్న నేపథ్యంలో పూర్తి ఫిట్‌నెస్‌ సాధించిన కేఎల్‌ రాహుల్‌ అందుబాటులోకి వచ్చాడు. నెట్‌ సెషన్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న ఈ కర్ణాటక బ్యాటర్‌.. తుదిజట్టులోకి రావడం ఖాయంగా మారింది. 

ఇక సంజూ అవసరం లేదు
ఈ నేపథ్యంలో ఇషాన్‌ను అడ్జస్ట్‌ చేయడానికి ఎవరిపై వేటు వేస్తారోనన్న చర్చ నడుస్తుండగా.. సంజూ శాంసన్‌ను బీసీసీఐ ఇంటికి పంపించడం ఆసక్తి కలిగిస్తోంది. కేఎల్‌ రాహుల్‌ వచ్చాడు కాబట్టి.. ఇక సంజూ అవసరం లేదని బీసీసీఐ అతడిని తిరిగి స్వదేశానికి పంపించినట్లు తెలుస్తోంది.  మరో వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ అందుబాటులో ఉన్న నేపథ్యంలో సంజూను వెనక్కి పంపినట్లు సమాచారం.

నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్న కేఎల్‌ రాహుల్‌
గాయం కారణంగా జట్టుకు చాలా కాలంగా దూరమైన కేఎల్‌ రాహుల్‌.. సర్జరీ తర్వాత జాతీయ క్రికెట్‌ అకాడమీలో పునరావాసం పొందాడు. అయితే, ఆసియా కప్‌ జట్టుకు ఎంపికైనప్పటికీ.. ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు.

ఈ క్రమంలో ఫిట్‌నెస్‌ నిరూపించుకుని రీఎంట్రీకి సిద్ధమైన రాహుల్‌.. గురువారం నుంచి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గంటల తరబడి బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేయడంతో పాటు.. వికెట్‌ కీపింగ్‌ కూడా చేస్తున్నట్లు సమాచారం. కాగా కొలంబోలో ఆదివారం టీమిండియా- పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ జరుగనుంది.

చదవండి: Ind vs Pak: పాక్‌ను ఓడించాలంటే అతడిపై వేటు పడాల్సిందే! లేదంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement