NZ W Vs Ban W: బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్‌ అద్భుత విజయం.. ఏకంగా.. | Sakshi
Sakshi News home page

NZ W Vs Ban W: బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్‌ అద్భుత విజయం.. ఏకంగా..

Published Mon, Mar 7 2022 12:43 PM

ICC Women World Cup 2022: New Zealand Beat Bangladesh By 9 Wickets - Sakshi

ICC Women World Cup 2022 Nz Vs Ban: ఐసీసీ మహిళా వరల్డ్‌కప్‌-2022 టోర్నీలో న్యూజిలాండ్‌ అద్భుత విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ మహిళా జట్టుపై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఓవల్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆతిథ్య జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. అయితే వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 27 ఓవర్లకు కుదించారు. 

ఈ క్రమంలో బంగ్లాదేశ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్లు షమీమా సుల్తానా(33 పరుగులు) ఫర్జానా హక్‌(52 పరుగులు) మినహా మిగతా వాళ్లంతా అత్యల్ప స్కోర్లకే పెవిలియన్‌ చేరారు. 

ఇక లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ మహిళా జట్టు ఒక వికెట్‌ కోల్పోయి 20 ఓవర్లలోనే టార్గెట్‌ పూర్తి చేసింది. సుజీ బేట్స్‌ అద్భుత హాఫ్‌ సెంచరీ(79 పరుగులు- 8 ఫోర్లు)తో అజేయంగా నిలిచి వైట్‌ ఫెర్న్స్‌' విజయంలో కీలక పాత్ర పోషించింది. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచింది. ఇక ఓపెనర్‌, కెప్టెన్‌ సోఫీ డివైన్‌ 14 పరుగులు చేయగా.. మరో బ్యాటర్‌ అమీలియా కెర్‌ 47 పరుగులు(నాటౌట్‌) సాధించింది.

ఐసీసీ మహిళా వరల్డ్‌కప్‌-2022
న్యూజిలాండ్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌ స్కోర్లు:
బంగ్లాదేశ్‌- 140/8 (27)
న్యూజిలాండ్‌- 144/1 (20)
9 వికెట్ల తేడాతో వైట్‌ ఫెర్న్స్‌ విజయం
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: సుజీ బేట్స్‌

చదవండి: Ind W Vs Pak W: పాక్‌ కెప్టెన్‌ కూతురిని ముద్దు చేసిన భారత మహిళా క్రికెటర్లు.. ఈ ఫొటో ఎంత అందంగా ఉందో! వైరల్‌

Advertisement
 
Advertisement
 
Advertisement