ధోని ఆట చూడకండి: అజయ్‌ జడేజా | I Am Not Happy With Dhonis Batting Position, Ajay Jadeja | Sakshi
Sakshi News home page

ధోని ఆట చూడకండి: అజయ్‌ జడేజా

Sep 26 2020 6:10 PM | Updated on Sep 26 2020 7:55 PM

I Am Not Happy With Dhonis Batting Position, Ajay Jadeja - Sakshi

న్యూఢిల్లీ:ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌  వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చెందడంపై కలత చెందిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ అజయ్‌ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రధానంగా ధోని బ్యాటింగ్‌ ఆర్డర్‌ను ఉద్దేశిస్తూ సెటైర్లు వేశాడు. ప్రస్తుత తరం పిల్లలు ధోని ఆటను గుర్తుంచుకోవద్దంటూ ఎద్దేవా చేశాడు. గతంలో ధోనికి, నేటి ధోనికి చాలా తేడా ఉందంటూ అభిప్రాయపడ్డాడు. ఇప్పుడిప్పుడే క్రికెట్‌ చూడటం ఆరంభించిన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు నేటి ధోని బ్యాటింగ్‌ను ఫాలో కావొద్దని విమర్శించాడు. క్రిక్‌బజ్‌లో గౌరవ్‌ కపూర్‌తో మాట్లాడిన అజయ్‌ జడేజా.. ధోని బ్యాటింగ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. (చదవండి: సీఎస్‌కేపై సెహ్వాగ్‌ సెటైర్లు)

‘నేను మళ్లీ అదే మాట చెబుతాను. ఎంఎస్‌ ధోని బ్యాటింగ్‌ స్థానం పట్ల సంతోషంగా లేను. వెనుక ఉండి పోరాడితే యుద్ధం ఎలా గెలుస్తాం. సైన్యంలో ఒక సామెత ఉంది.  జనరల్‌ అనేవాడు వైదొలిగితే యుద్ధం ముగుస్తుందనే నానుడి ఉంది. ఇప్పుడు సీఎస్‌కే పరిస్థితి కూడా అలానే ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలిగిన ధోని.. సీఎస్‌కేకు సారథిగా ఉన్నాడు. పిల్లలు క్రికెట్‌ను టీవీల్లో చూస్తూ ధోని గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ ఐపీఎల్‌లో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఏడు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన ధోనిని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. నేను ధోని బ్యాటింగ్‌ పొజిషన్‌తో కానీ, ఆటతో కానీ సంతోషంగా లేను అనే విషయాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నా. ఈ లీగ్‌కు ముందు వరకూ ధోని ఒక గ్రేట్‌.. ఇప్పుడు కాదు’ అని జడేజా పేర్కొన్నాడు. (చదవండి: రైనా వైపు చూసే ప్రసక్తే లేదు: సీఎస్‌కే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement