PC: BCCI
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించిన ముంబై.. మరో ఓటమిని చవిచూసింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌తో హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్‌గా తిరిగి వచ్చాడు. గాయం నుంచి కోలుకుని వచ్చిన ఈ ఆల్‌రౌండర్.. కోల్‌కతాతో మ్యాచ్‌లో 26 పరుగులు చేయడంతో పాటు.. రెండు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 13 పరుగులే ఇచ్చాడు. అయితే, వికెట్ మాత్రం తీయలేకపోయాడు.
నిజానికి కేకేఆర్ ఇన్నింగ్స్‌లో పదో ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రెండో బంతిని రోవ్‌మన్ పావెల్ గాల్లోకి లేపాడు. అప్పుడు బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రాబిన్ మింజ్, దీపక్ చహర్ అలా చూస్తూ ఉండిపోయారే తప్ప బంతిని అందుకునే ప్రయత్నం చేయలేదు.
ఈ క్రమంలో చహర్ స్పందించి ముందుకు రాగా బంతి నేలమీద పడిపోయింది. దీంతో హార్దిక్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఏడవలేక నవ్వినట్లుగా చప్పట్లు కొడుతూ వ్యంగ్య రీతిలో స్పందించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య కోల్‌కతా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 147 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా 18.5 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. మనీశ్ పాండే (45), రోవ్‌మన్ పావెల్ (40) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో కోల్‌కతా ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకోగా.. ముంబై పదమూడింట తొమ్మిదో పరాజయం నమోదు చేసింది.
𝐓𝐎𝐓𝐀𝐋 𝐌𝐈𝐒𝐂𝐎𝐌𝐌𝐔𝐍𝐈𝐂𝐀𝐓𝐈𝐎𝐍 😱
A shocking mix-up at deep-backward square leg as Deepak Chahar & Robin Minz both pull out of the catch. #TATAIPL Race to Playoffs 2026 👉 #KKRvMI | LIVE NOW ➡️ https://t.co/kVSpVvhylO pic.twitter.com/Gcg2H1ifmu— Star Sports (@StarSportsIndia) May 20, 2026


