'అశ్విన్‌ నీ కెరీర్‌ను ముగించాడు'.. ట్రోలర్స్‌పై భజ్జీ ఫైర్‌ | Harbhajan Singh Blasts Troll On X In Ugly War Of Words Over R Ashwin Commentary, Read Story For More Details | Sakshi
Sakshi News home page

IPL 2026: 'అశ్విన్‌ నీ కెరీర్‌ను ముగించాడు'.. ట్రోలర్స్‌పై భజ్జీ ఫైర్‌

Mar 29 2026 6:16 PM | Updated on Mar 29 2026 6:57 PM

Harbhajan Singh Blasts Troll On X In Ugly War Of Words Over R Ashwin Comment

ఐపీఎల్‌-2026 సీజన్‌ ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 6 వికెట్ల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌ అనంతరం భారత స్పిన్నర్‌ హార్భజన్‌ సింగ్‌, ఓ క్రికెట్‌ అభిమాని మధ్య ఎక్స్‌ వేదికగా జరిగిన మాటల యుద్దం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.

ఏం జరిగిందంటే?
ఐపీఎల్‌-19వ సీజన్‌లో హార్భజన్‌ హిందీ కామెంటటేర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇదే మ్యాచ్‌లో మరో దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ హిందీ వ్యాఖ్యతగా డెబ్యూ చేశాడు. దీనిపై ఒక అభిమాని ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ "అశ్విన్ రాకతో హర్భజన్ కామెంటరీ కెరీర్ ముగిసిపోతుంది.

గతంలో టీమిండియాలో హర్భజన్ స్థానాన్ని అశ్విన్ ఎలా భర్తీ చేసి అతని అంతర్జాతీయ కెరీర్‌ను ముగించాడో, ఇప్పుడు కామెంటరీలో కూడా అలాగే జరుగుతుంది" అని వెటకారంగా పోస్ట్ చేశాడు.

అంతేకాకుండా హర్భజన్, సెహ్వాగ్, సిద్ధూ వంటి హిందీ కామెంటటర్ల కంటే ఇయాన్ బిషప్ అసలైన భారతీయుడిలా కన్పిస్తున్నడు అని  పోస్ట్‌ చేశాడు. ఇది చూసిన భజ్జీ సదరు యూజర్‌కు సరైన కౌంటరిచ్చాడు.

ఏనుగు బజారులో వెళ్తుంటే వేల కుక్కలు మొరుగుతాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపో టామీ అంటూ హార్భజన్‌ రిప్లై ఇచ్చాడు.

శునకాలకు నెయ్యి అరగదు. అలాగే నీలాంటి వాళ్లకు నా సమాధానం ఆర్ధం కాదు. వెళ్లిపో టామీ అంటూ రెండో పోస్ట్‌కు టర్బనేటర్ తనదైన శైలిలో సమాధనమిచ్చాడు.
చదవండి: IPL 2026: 'రెండేళ్ల నిషేధం సరిపోదు'.. బెన్ డ‌కెట్‌పై గ‌వాస్క‌ర్ ఫైర్‌
 

Advertisement
 
Advertisement
Advertisement