4 వికెట్లతో మెరిసిన గుజరాత్ టైటాన్స్ పేసర్
లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై గిల్ బృందం ఘనవిజయం
లక్నో: ఐపీఎల్ 19వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. ఆదివారం ‘డబుల్ హెడర్’లో భాగంగా జరిగిన తొలి పోరులో మాజీ విజేత గుజరాత్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిచింది. గత మ్యాచ్‌లో ముకుల్ చౌదరీ మెరుపులతో విజయం సాధించిన లక్నో... ఈ పోరులో అటు బ్యాటింగ్ లో, ఇటు బౌలింగ్‌లో కనీస ప్రతిఘటన కనబర్చలేకపోయింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ మార్క్‌రమ్ (21 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన బ్యాటర్లలో ఒక్కరు కూడా ఇరవై పరుగులు చేయలేకపోయారు. కెప్టెన్ రిషభ్ పంత్ (18), మార్ష్ (11), ఆయుశ్ బదోనీ (9), పూరన్ (19), అబ్దుల్ సమద్ (18), ముకుల్ చౌదరీ (18), జార్జ్ లిండే (16), షమీ (12 నాటౌట్) తలా కొన్ని పరుగులు చేశారు.
గుజరాత్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రసిధ్ కృష్ణ 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (37 బంతుల్లో 60; 11 ఫోర్లు), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (40 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. లక్ష్యం పెద్దది కాకపోవడంతో టైటాన్స్ ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది.
స్కోరు వివరాలు
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్‌రమ్ (సి) సుందర్ (బి) ప్రసిధ్ 30; మార్ష్ (సి) గిల్ (బి) రబాడ 11; పంత్ (సి) తెవాటియా (బి) సిరాజ్ 18; బదోని (సి) ఫిలిప్స్ (బి) ప్రసిధ్ 9; పూరన్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 19; అబ్దుల్ సమద్ (సి) ఫిలిప్స్ (బి) అశోక్ 18; ముకుల్ (సి) బట్లర్ (బి) ప్రసిధ్ 18; లిండే (సి) (సబ్) షారుక్ (బి) అశోక్ 16; షమీ (నాటౌట్) 12; అవేశ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 164.
వికెట్ల పతనం:1–14, 2–45, 3–69, 4–74, 5–109, 6–118, 7–131, 8–157.
బౌలింగ్: సిరాజ్ 4–0–19–1; రబాడ 4–0–54–1; అశోక్ 4–0–32–2; ప్రసిధ్ 4–0–28–4; రషీద్ 4–0–25–0.
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) అవేశ్ (బి) రాఠీ 15; గిల్ (సి) పంత్ (బి) ప్రిన్స్ 56; బట్లర్ (సి) మార్క్‌రమ్ (బి) షమీ 60; సుందర్ (నాటౌట్) 21; తెవాటియా (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.4 ఓవర్లలో 3 వికెట్లకు) 165.
వికెట్ల పతనం: 1–45, 2–129, 3–135.
బౌలింగ్: షమీ 4–0–36–1; ప్రిన్స్ 4–0–31–1; దిగ్వేశ్ రాఠీ 4–0–31–1; లిండే 3–0–28–0; అవేశ్ 2–0–24–0; మార్క్‌రమ్ 1.4–0–15–0.


