నేడు భారత్, ఇంగ్లండ్‌ మహిళల జట్ల మధ్య తొలి టి20 | India Women Begin T20 World Cup Preparations With High Voltage Series Against England Women, Details Inside | Sakshi
Sakshi News home page

నేడు భారత్, ఇంగ్లండ్‌ మహిళల జట్ల మధ్య తొలి టి20

May 28 2026 9:52 AM | Updated on May 28 2026 12:10 PM

First T20 Between India And England Women's Team

రాత్రి 11 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్, సోనీ లివ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

చెమ్స్‌ఫోర్డ్‌: టి20 వరల్డ్‌ కప్‌కు ముందు సన్నాహకంగా ఇంగ్లండ్‌తోనే 3 టి20 మ్యాచ్‌ల సిరీస్‌కు భారత మహిళల జట్టు సిద్ధమైంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం తలపడుతుంది.

ప్రస్తుతం వన్డే వరల్డ్‌ చాంపియన్‌ అయిన మన జట్టు టి20ల్లో కూడా సత్తా చాటాలని పట్టుదలగా ఉన్న నేపథ్యంలో ఇంగ్లండ్‌ గడ్డపై మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కీలకం కానుంది. ఏడాది క్రితం ఇక్కడే ఇంగ్లండ్‌పై భారత్‌ టి20 సిరీస్‌ నెగ్గింది. ప్రస్తుతం అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న స్మృతి మంధానతో పాటు షఫాలీ వర్మ, జెమీమా, రిచా దూకుడుగా ఆడటంపై జట్టు విజయావకాశాలు ఉన్నాయి.

బౌలింగ్‌లో రేణుకా సింగ్, క్రాంతి, అరుంధతి రూపంలో ముగ్గురు పేసర్లు ఉండగా, శ్రీచరణిపై స్పిన్‌ భారం నిలిచింది. కెపె్టన్‌ చార్లీ డీన్‌తో పాటు సీనియర్లు సోఫియా డంక్లీ, హీతర్‌ నైట్, ఎమీ జోన్స్, సోఫీ ఎకెల్‌స్టోన్‌ల ప్రదర్శనపై ఇంగ్లండ్‌ ఆధారపడుతోంది. మరో 9 పరుగులు సాధిస్తే హర్మన్‌ప్రీత్‌ అంతర్జాతీయ టి20ల్లో 4 వేల పరుగులు పూర్తి చేసుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement